Politics

ఈనాడు పై జగన్ సర్కార్ పరువు నష్టం దావా

ఈనాడు పై జగన్ సర్కార్ పరువు నష్టం దావా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనాడు పత్రికపై ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌పై తప్పుడు రాతలు రాసినందుకు పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది.
అయితే, మే 12వ తేదీన పోలవరంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. ఈనాడు కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండీ, జర్నలిస్టుల క్రిమినల్‌ ప్రాసిక్యూషన్ ఆఫ్‌ డిఫమేషన్‌ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక, పోలవరంపై ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ ఈనాడు తప్పుడు కథనాలు సృష్టించడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది.