తూర్పుగోదావరి జిల్లాకు పయనం కానున్నారు సీఎం జగన్. రేపు రాజమండ్రి రానున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి ఓ హోటల్‌లో హాజరుకానున్నారు సీఎం జగన్.ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 3.50 గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్‌కు రానుంది. 3.55 నుంచి 4.05 వరకు ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు సీఎం జగన్. ఇక సాయంత్రం 4.10 నుంచి 4.25 వరకు ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. ఈ మేరకు జగ్గంపేటలో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అధికారులు.
ఇక అటు ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది జగన్ సర్కార్. 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ ఇచ్చింది జగన్ సర్కార్. గ్రూప్ -1లో 89, గ్రూప్-2లో 508 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.