DailyDose

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రద్దు

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రద్దు

సింగరేణి సంస్థలో 2022 సెప్టెంబరు 4న నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 పోస్టుల పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. వివిధ కారణాలతో ఈ పోటీ పరీక్ష నోటిఫికేషన్‌ చెల్లదంటూ జస్టిస్‌ మాధవిదేవి ధర్మాసనం స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్‌ ఇచ్చింది. 77,898 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. అదే ఏడాది సెప్టెంబరు 4న పరీక్షలను నిర్వహించారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ క్రమంలో.. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ రామగుండం ప్రాంతానికి చెందిన ఓ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.