DailyDose

జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. సుమారు ₹1000 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని ఆందోళనకు దిగారు. బల్దియా ముట్టడికి కాంట్రాక్టర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలిస్తున్నారు.