Business

క్రోమ్‌లో బింగ్ ఇలా వాడవచ్చు

క్రోమ్‌లో బింగ్ ఇలా వాడవచ్చు

యూజర్లకు అవసరమైన సమాచారాన్ని సరళంగా అందించటంతో కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌జీపీటీల వినియోగం ఎక్కువైంది. ఈ క్రమంలోనే గూగుల్‌ బార్డ్‌ (Google Bard)ను విడుదల చేయగా.. మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ (Microsoft Bing)సెర్చ్‌ ఇంజిన్‌లో ఏఐ చాట్‌ (AI Chat)లను తీసుకొచ్చింది.  అయితే ఈ బింగ్‌ సేవల్ని ఎడ్జ్‌ బ్రౌజర్‌కు మాత్రమే మైక్రోసాఫ్ట్‌ పరిమితం చేసింది. ప్రస్తుతం ఈ సేవల్ని విస్తృతం చేస్తోంది. విండోస్‌ (Windows), మ్యాక్‌ఓఎస్‌ (macOS), లీనక్స్‌ (Linux) ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోయాక్సెస్‌ చేసే సదుపాయాన్ని కల్పించింది. అయితే దీన్ని ఎలా వినియోగించాలో చూద్దాం..

దీన్ని ఎలా వాడాలంటే..

*   మీ గూగుల్‌ సెర్చ్ బార్‌లో ‘Microsoft Bing AI’ అని టైప్‌ చేసి లేదా ‘www.bing.com’ అని సెర్చ్‌ చేయాలి.

*  స్క్రీన్ ఎగువ  చాట్ ట్యాబ్‌  కనిపిస్తుంది. దాని పక్కనే మైక్రోసాప్ట్‌ బింగ్‌ లోగో ఉంటుంది.

*   ఆ ట్యాబ్‌పై క్లిక్‌ చేయగానే బింగ్‌ ఏఐ చాట్‌ బాట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలా ఈ ఫీచర్‌ని వినియోగించవచ్చు.

సులభమైన సమాచారం కోసం ఈ ఎడ్జ్‌ను వినియోగించాలని మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్‌లో తెలిపింది.