శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆరు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత వివరాలను మీడియాకు వెల్లడించారు.
ధర్మకర్తల మండలి నిర్ణయాలివే…
* శ్రీశైలంలో త్వరలో మహా మంగళ హారతి సేవ పునరుద్ధరణకు నిర్ణయం.
* పాతాళగంగ వద్ద కర్మకాండల నిర్వహణ కోసం రూ.40లక్షలతో షెడ్డు ఏర్పాటునకు నిర్ణయం.
* శ్రీశైలంలో వెయ్యి ఎకరాల్లో 150 ఏ గ్రేడ్ కాటేజీలు, 50 కమ్యూనిటీ సత్రాలు, పార్కింగ్ ప్రదేశాల అభివృద్ధికి నిర్ణయం.
* మల్లమ్మ కన్నీరు ఆలయం వద్ద నుంచి డంపింగ్ యార్డు వరకు రూ.4కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు.