DailyDose

చిత్తూరులో ఏనుగు భీభత్సం-TNI నేటి నేర వార్తలు

చిత్తూరులో ఏనుగు భీభత్సం-TNI నేటి నేర వార్తలు

*  చిత్తూరులో ఏనుగు భీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలోని 190 రామాపురం, సీకే పల్లిలో ముగ్గురిపై దాడి చేసింది. 190 రామాపురంలో దంపతులపై దాడి చేసి చంపేసింది. పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన దంపతులు వెంకటేశ్ (50), సెల్వి (48)పై దాడి చేయడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.మరోవైపు సీకే పల్లికి చెందిన సుధాకర్‌ తోటలో ఏనుగు తిరుగుతుండటాన్ని గమనించి బసవాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు కార్తీక్‌ వెళ్లగా అతడిపై దాడి చేసి దంతాలతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

*  ఢిల్లీలో కాల్పుల కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేకెత్తించాయి. ఈ ఘటనలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న 36 ఏళ్ల హర్ ప్రీత్ గిల్ దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృష్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. భజన్ పురాలోని సుభాష్ విహార్ ప్రాంతంలో హర్ ప్రీత్ గిల్  అమెజాన్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్కడే ఆయన మేనమామ కూడా అదే ప్రాంతంలో ఉంటూ ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ మంగళవారం రాత్రి సమయంలో ఎక్కడికో బైక్ పై వెళ్లి తిరిగి 11.30 గంటల సమయంలో భజన్ పురా ప్రాంతానికి చేరుకున్నారు. వారిద్దరిపై బైక్ పై వచ్చిన దుండగులు పలువురు దుండుగులు కాల్పులు జరిపారు. దీంతో గిల్ తల కుడి వైపు నుంచి చెవి వెనుక భాగంలోకి బుల్లెట్ ప్రవేశించి వెళ్లిపోయిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. ఈ ఘటనలో అతడి మేనమామ కూడా గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానికులు  జగ్ ప్రవేశ్ చంద్ర హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే గిల్ మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. కాగా.. తనపై తనపై, తన మేనల్లుడిని ఐదుగురు దుండగులు కాల్చిచంపారని మృతుడి మేనమామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ప్రస్తుతం అతడు లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దాడి చేసిన వారిని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

వరంగల్ లో దారుణం

పట్టణంలోని శివనగర్ లో   నజీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారంనాడు తెల్లవారుజామున  హత్య చేశారు. ఇంట్లోకి చొరబడి నజీర్ ను హత్య చేశారు దుండగులు. మృతదేహన్ని  పోస్టుమార్టం కోసం  ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.నజీర్  రైల్వేలో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. నజీర్ ను ఎవరు హత్య చేశారు, ఎందుకు  హత్య చేశారనే విషయాలపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు  పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు మోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. వరంగల్ పట్టణంలో  ఈ తరహా ఘటనలు  ఎక్కువగా  చోటు చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుండెపోటుతో మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు

గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా పెద్దపల్లి లో విషాదం చోటు చేసుకుంది.గుండెపోటుతో మృతి చెందిన అన్నకి అతని చెల్లెలు రాఖీ కట్టిన సంఘటన పెద్దపల్లి జరిగింది. పెద్దపల్లి – ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్య అప్పటిదాకా సంతోషంగా ఉండి ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఖంతో కడసారిగా కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

కేటుగాళ్ల గరానామోసం

 ఒకరు కాదు ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో యువకులు రోడ్డుపై తిరుగుతుంటారు. వారి చేతిలో అందంగా ప్యాక్ చేసిన ఇయర్ బడ్స్ ఉంటాయి. వాటిపై ఉన్న ధరలో సగం ధరకే ఇస్తామంటూ వాహనదారులకు ముచ్చట చెబుతుంటారు. అందిన కాడికి అంటగట్టేస్తుంటారు. గత మూడు రోజులుగా మహా రాష్ట్ర యువకులు చేస్తున్న హాడావుడిపై స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.అది మంగళగిరి తాడేపల్లి రోడ్డు ఉదయం పది గంటల సమయంలో పదుల సంఖ్యలో యువకులు రోడ్డుపై తారస పడుతుంటారు. ప్రతిఒక్కరి వీపుకు ఒక బ్యాగ్ ఉంటుంది. చేతిలో ఒక బాక్స్ ఉంటుంది. ప్యాక్ చేసిన ఇయర్ బడ్స్ బాక్స్ ఉంటాయి. ఇవి యాపిల్ ఇయర్ బడ్స్ అంటూ యువకులు రోడ్డుపై వచ్చే వాహదారులకు చెబుతుంటారు. ఆ బాక్స్ పై ఇరవై ఆరు వేల రూపాయల ధర ఉంది. వాటిని సగం ధరకే విక్రయిస్తామని చెబుతుంటారు. కారులో వచ్చిన వారికి పది వేలు చెప్పి వచ్చినంత గుంజుకుంటారు. ఆ తర్వాత బైక్ లపై వచ్చిన వారికి ఐదు వేల నుండి వెయ్యి రూపాయలకు ఇయర్ బడ్స్ విక్రయిస్తుంటారు. గత మూడు రోజుల నుండి రోజూ లక్షల రూపాయల్లో ఈ బేరం జరగుతుంది. వీరంతా మహారాష్ట్ర నుండి వచ్చినట్లు చెబుతున్నారు. హిందీలో మాట్లాడుతున్నారు. చూడటానికి అచ్చం యాపిల్ ఇయర్ బడ్స్ ప్యాక్ లాగే ఉండటంతో దారిపోతున్న అనేక మంది వాహనదారులు వాటి పట్ల మక్కువ చూపుతున్నారు.అయితే అవి ఇమిటేషన్ ఇయర్ బడ్స్ గా తేలింది. వీరంతా డూప్లికేట్ ఇయర్ బడ్స్ ను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు వీరి మాటలు, వేషధారణ చూసి మోస పోతున్నారంటున్నారు. గట్టిగా నిలదీస్తే అవి చైనా నుండి వచ్చి ఇమిటేషన్ బడ్స్ గా తేలింది. గత మూడు రోజుల నుండి దాదాపు నాలుగైదు లక్షల రూపాయల వరకూ బిజినెస్ చేసినట్లు భావిస్తున్నారు. వీరంతా విజయవాడలో మకాం వేసినట్లు తెలుస్తుంది.

సాస్ కోసం ప్రాణాలు వదిలిన చిన్నారి

కొన్నిసార్లు చిన్న మాటలు వల్ల ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాము.. ముఖ్యంగా ఆహారం విషయం ఫుడ్ యాజమాన్యాలకు జనాలకు మధ్య జరిగిన గొడవల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది.. వాషింగ్టన్, DC లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో 16 ఏళ్ల అమ్మాయి కత్తితో పొడిచి చంపబడింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నైమా లిగ్గాన్ అనే యువతిని మరో 16 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు US రాష్ట్రంలో హత్యకు గురైన 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 13వ వ్యక్తి ఆమె అని అవుట్‌లెట్ తెలిపింది. ఆమెపై దాడి చేసిన వ్యక్తిపై సెకండ్ డిగ్రీ మర్డర్‌గా అభియోగాలు మోపబడ్డాయి.. అంతేకాదు బెయిల్ కూడా రాలేదు..నగరంలో పిల్లలు, యుక్తవయస్కులకు సంబంధించిన నేరాలు పెరగడం ఎమర్జెన్సీగా భావించిన మేయర్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.. సాస్‌పై వివాదానికి సంబంధించి ఎవరైనా చనిపోయారు అని DC సుపీరియర్ కోర్ట్ జడ్జి షెర్రీ బీటీ-ఆర్థర్ చెప్పారు. ఆమె అనుమానితుడిని శుక్రవారం మరో విచారణ వరకు ఉంచాలని ఆదేశించింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. నైమా, మూడవ అమ్మాయి మధ్య వాగ్వాదం తర్వాత కత్తిపోటు జరిగింది. కోర్టు ముందు వాంగ్మూలం ఇస్తూ, డిటెక్టివ్ బ్రెండన్ జాస్పర్ మాట్లాడుతూ, నైమాపై దాడి చేసిన 16 ఏళ్ల యువకుడు, ఇతర ఇద్దరు బాలికలు వాహనంలోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు వెంబడించాడు..ఆ తర్వాత జేబులో కత్తితో నైమా ఛాతీ, పొత్తికడుపు పై ​​పొడిచాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించినా కాపాడలేకపోయారు. వేసవి విరామం తర్వాత థామస్ స్టోన్ హైస్కూల్‌లో తరగతులను పునః ప్రారంభించేందుకు ఒకరోజు ముందు నైమా మరణించిందని పోస్ట్ నివేదిక పేర్కొంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసినప్పుడు దాడి చేసిన వ్యక్తి పేరు వెల్లడించని కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.. కేవలం సాస్ కోసం ఇలాంటి గొడవ జరగడం జనాలను కలవరించి వేస్తుంది.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

క్యాష్‌ ఆన్‌ డెలివరీతో భారీ మోసం

ఈ-కామర్స్‌లో సరికొత్త మోసం ఇది. వివిధ కంపెనీల డేటా దొంగిలించి.. వినియోగదారులకు నకిలీ వస్తువులు అంటగడుతున్న మోసగాళ్ల గుట్టు రట్టు చేసిన బెంగళూరు పోలీసులు 21 మందితో కూడిన అంతర్‌రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వీరు ఈ-కామర్స్‌ కంపెనీల నుంచి క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్ల డేటాను దొంగిలించి.. వారు ఆర్డర్‌ చేసిన వస్తువులకు బదులు నకిలీవి పంపేవారు. వినియోగదారులు ఆర్డర్‌ చేసిన తేదీ కన్నా.. ముందే వారి అడ్రస్‌కు నకిలీ వస్తువులు పంపించి డబ్బులు వసూలు చేసుకునే వారు. అయితే, అవి నకిలీవని గ్రహించిన వినియోగదారులు.. వాటిని ఈ-కామర్స్‌ కంపెనీలకు రిటర్న్‌ చేసేవారు. ఫలితంగా ఆ కంపెనీలు నష్టాలను చవిచూసేవి. సాధారణంగా ఈ-కామర్స్‌ కంపెనీలు వస్తువులను అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలకు విక్రయిస్తాయి.అవి ఎట్టి పరిస్థితుల్లోనూ డేటాను బహిర్గతం చేయకూడదని నిబంధన ఉంది. ఆ కంపెనీల్లో పనిచేసే కొందరు.. మోసగాళ్ల నుంచి డబ్బులు తీసుకుని డేటా విక్రయిస్తున్నారు. నకిలీ వస్తువులను అంటగట్టినందు వల్ల తమకు 2021 జూన్‌ నుంచి రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని ఒక కంపెనీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కొరియర్‌ సబ్‌-షిప్పింగ్‌ కంపెనీ సమాచారం, నిందితులు కస్టమర్లకు పంపిన నకిలీ షిప్‌మెంట్‌ డాక్యుమెంట్‌, కేవైసీ, బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని రాబట్టి దర్యాప్తు చేశారు. ముంబయి, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారి నుంచి రూ. 26.95 లక్షలు నగదు, 11 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శివప్రకాశ్‌ తెలిపారు.

నిద్రపోతున్న పిల్లాడి గొంతుకోసి దారుణంగా చంపిన కసాయి తండ్రి

అన్యం పుణ్యం తెలియని చిన్న వయసు… లోకాన్ని సరిగ్గా చూడని ఆ బాలుడిని కన్న తండ్రి కర్కోటకంగా అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన సంఘటన ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతుంది.. ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్కూలుకు వెళ్లవలసిన ఆ పసివాడు తండ్రి గొంతు కోసి చంపడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.బంధాలు.. బంధుత్వాలు మరచిపోయి మనుషులు మృగాలుగా మారుతున్నారు. కర్కశంగా ప్రవర్తిస్తూ జంతువుల కంటే హీనంగా నడుచుకుంటున్నారు. పిల్లలపై ప్రేమానురాగాలు చూపించాల్సిన తల్లిదండ్రులు రక్తం కళ్ళ చూస్తున్నారు. కన్న తండ్రి కసాయిగా ప్రవర్తించి కొడుకును గొంతుకోసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కమలాపురం మండలపరిధిలోని అగస్త్య లింగాయపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమేశ్వర రెడ్డి(10)అనే బాలుని కన్న తండ్రి శివశంకర్ రెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో నిద్రపోతున్న కొడుకును కత్తితో గొంతు కోసి పరారు అయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే సోమేశ్వర రెడ్డి మృతి చెందాడు.పొద్దును చూడకుండా పొద్దారిపోయిన ఆ బాబు చేసిన పాపం ఏమిటి .. ఎంతో ఆప్యాయంగా చూసుకునే తండ్రే ఆ బాబు పాలిట శాపంగా మారాడు ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేపి ప్రేమతో బడికి పంపించే ఆ తండ్రి తన కన్న కొడుకుని కసాయిలాగా నరికి పీక కోసి చంపడంతో ముక్కుపచ్చలారని సోమేశ్వర్ రెడ్డి అనే బాలుడు చనిపోయాడు. ఏమి తప్పు చేశాడో తెలియదు ఎందుకు చంపాడో కనీసం తండ్రికి కూడా తెలియదు ముక్కుపచ్చలారని ఆ పసివాడి మరణంతో ఆ గ్రామమంతా సోకసంద్రం లేని మునిగిపోయింది ఎంతో ఆప్యాయంగా తిరిగే ఆ తండ్రి కొడుకులకు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు గానీ ముక్కు పచ్చలారని ఆ పసివాడి ప్రాణం మాత్రం అద్దాంతరంగా గాలిలో కలిసిపోయింది ఆ తండ్రికి పుట్టడమే ఆ కొడుకు చేసిన పాపము అని ఆ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు సోకసముద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి

ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్ పట్టణంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పింప్రి చించ్వాడ్‌లోని చిఖ్లీ ప్రాంతంలోని పూర్ణా నగర్‌లోని పూజా హైట్స్ భవనంలో ఉన్న దుకాణంలో ఉదయం 5:30 గంటలకు ఈ సంఘటన జరిగింది.దీంతో భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హార్డ్‌వేర్ షాప్ మెజ్జనైన్‌పై నిద్రిస్తున్న ఇద్దరు మైనర్లు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మంటలను ఆర్పి మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని.. చిమ్నారం చౌదరి (48), నమ్రతా చిమ్నారం చౌదరి (40), భవేష్ చౌదరి (15), సచిన్ చౌదరి (13)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం షార్ట్-సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

పూణేలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది.. పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదని పోలీసులు, త్వరలోనే ఫైర్ కు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్‌వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25 గంటల ప్రాంతం లో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదం పై స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.ఈ ఘటన పై పింప్రి చించ్‌వాడ్ అగ్నిమాపక దళానికి చెందిన రుషికాంత్ చిపాడే మాట్లాడుతూ, దుకాణం లోపల నిర్మించిన తాత్కాలిక అనెక్స్‌లో నివసిస్తున్న నలుగురు వ్యక్తులు మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత చనిపోయారని తెలిపారు. మృతులను చిమ్నారం బెనారం చౌదరి (48), అతని భార్య నమ్రత (40), వారి ఇద్దరు కుమారులు భావేష్ (15), సచిన్ (13) గా గుర్తించారు.. రాజస్థాన్‌లో ని పాలికి చెందిన ఈ కుటుంబం షాహునగర్‌లో సచిన్ హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే హార్డ్‌వేర్ దుకాణాన్ని నడుపుతోంది.. మృత దేహలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.