Politics

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.‘‘తెదేపా అధికారంలోకి రాగానే.. తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా రూ.15వేలు ఇస్తాం. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం. పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. అవసరమైతే మరో సిలిండర్‌ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పీ-4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తాం. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయొచ్చు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు. పేదవారికి అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడతాం. మనకు ఏమేం కావాలో ఇచ్చేందుకు చాట్‌ జీపీటీ వచ్చింది’’ అని చంద్రబాబు అన్నారు.