తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 18 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఏడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, భద్రత విషయంలోనూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.