DailyDose

తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు ఆమోదం

తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు ఆమోదం

తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతించింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఉన్నత న్యాయస్థానం.. టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు  అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషనర్ల తరఫున చిక్కుడు ప్రభాకర్‌, కృష్ణయ్య వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు.