Politics

కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా

కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా

సెప్టెంబర్ 2న జరగాల్సిన కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం సెప్టెంబర్‌ 2వ తేదీన కాకుండా మరో తేదీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశం రోజున పలు కార్యక్రమాలు ఉండడంతో సమయం సరిపోదని టీపీసీసీ(TPCC) ఈ నిర్ణయానికి వచ్చింది. అదే రోజున వైఎస్సార్ వర్ధంతితో పాటు పలు కార్యక్రమాలు ఉన్నందున సమావేశం వాయిదా వేయాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీపీసీసీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మెజార్టీ నాయకుల అభిప్రాయానికి అమోదం తెలిపింది.సెప్టెంబర్ 2వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించేందుకుటీపీసీసీ అమోదం తెలిపింది. సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పూర్తి వివరాలతో స్క్రూటిని చేయనున్నట్లు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ తెలిపింది. మరోసారి అభ్యర్థుల ఎంపికపై సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు టీ పీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, బీఆర్ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటానికి సంబంధించిన అంశాలపై పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరణ్ కార్యచరణ ప్రకటిస్తారు.