ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరో ఆరు నెలల్లో మొదలుకానున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రెండో వరుస విజయం నమోదు చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ సంక్షేమ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (15వ ఏపీ శాసనసభ) పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనున్న సందర్భంగా కిందటి ఎన్నికలను ఒకసారి గుర్తుచేసుకుందామని.. లోక్ సభతోపాటు జరగాల్సిన ఈ ఎన్నికలకు 2019 మార్చి 10న ఆదివారం భారత ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2019 మే 27 లోగా ఏపీ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరిపించాల్సి ఉందని పేర్కొన్నారు.దీంతో ఎలక్షన్ షెడ్యూలు ప్రక్రియ పూర్తి కావడానికి రెండున్నర నెలల ముందు తేదీలు అధికారికంగా ప్రకటించారు. కిందటి శాసనసభ ఎన్నికల కార్యక్రమాన్ని బట్టి చూస్తే…రాష్ట్ర 16వ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల తర్వాత షెడ్యూలు ప్రకటిస్తారు. అంటే, 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎలక్షన్ల తేదీలు వస్తాయి. పార్లమెంటుతోపాటు జరిగిన కిందటి శాసనసభ ఎన్నికల ప్రక్రియ 2019 మార్చి 10–మే నెల 23 మధ్య 75 రోజుల్లో పూర్తయింది. మార్చి 10న ఎన్నికల షెడ్యూలు రాగా, మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 25 లోక్ సభ, 175 శాసనసభ స్థానాలకు ఒకే రోజున (2019 ఏప్రిల్ 11న) పోలింగ్ జరిగింది. ఎన్నికల కార్యక్రమం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన మార్చి 18 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుత తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు గారు చివరిసారి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ జోడు ఎన్నికల్లో ప్రస్తుత పాలకపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్నెన్నడూ కనీవినీ ఎరగని మెజారీటీతో ఘనవిజయం సాధించిందని స్పష్టం చేశారు.