ప్రపంచంలోనే పురాతన భాష, దేవతల భాషగా పరిగణించబడుతున్న సంస్కృతం దినోత్సవం ఈ రోజే. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏడాది శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజన ‘ప్రపంచ సంస్కృత దినోత్సవం’’ని జరుపుకుంటున్నారు. దీనిని ‘సంస్కృత దివాస్’ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31న అంటే ఈ రోజు జరుపుకుంటున్నాం.
మరుగున పడుతున్న సంస్కృత భాష ఔన్నత్యం, గొప్పతనం, అవగాహన, ప్రచారం చేసే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ భాష దేవనాగరి లిపి కలిగిన సంస్కృతం దేవతల భాషగా కూడా పరిగణించబడుతుంది. హిందూ వేదిక కాలంలో ఈ భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి హిందూ మత ప్రముఖ గ్రంథాలను రాయడానికి సంస్కృత భాషనే ఉపయోగపడింది. సంస్కృతాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించి ఋషులకు అందించాడని చాలా మంది నమ్ముతారు.
చరిత్ర: సంస్కృత దినోత్సవం వేడులకను 1969లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రఖ్యాత సంస్కృత పండితుడు పాణిని, భాషకు చేసిన కృషికి గానూ, ఆయన వారసత్వానికి నివాళిగా ఈ రోజును సంస్కృత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతీ సంవత్సరం పాణిని జన్మదినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు.
ప్రాముఖ్యత: భారత సంస్కృతి, ముఖ్యంగా హిందూమతంలో సంస్కృతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవనాగరి లిపిలో ఉండే ఈ భాషలోనే ఎన్నో ప్రముఖ గ్రంథాలను మన పూర్వీకులు రాశారు. మత గ్రంథాల దగ్గర నుంచి అనేక శాస్త్రసాంకేతిక, వైద్య, ఆయుర్వేద గ్రంథాలు కూడా ఈ భాషలోనే ఉన్నాయి.ముఖ్యంగా పాణిని పండితుడు ‘అష్టాధ్యాయి’ అనే గ్రంథాన్ని రచించారు. ఇది సంస్కృత భాషకు సంబంధించి వ్యాకరణ గ్రంథం. ఇది ప్రపంచంలోనే అద్వితీయమైన వ్యాకరణ గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. అష్టాధ్యాయి ఎనిమిది అధ్యయాలు కలిగి 4000 వేల వ్యాకరణ సూత్రాలను కలిగి ఉంటుంది. క్రీస్తుపూర్వం 3000 ఏళ్ల కన్నా పూరాతనమైన భాషగా సంస్కృతానికి పేరుంది.ప్రపంచంలోనే అనేక భాషలకు చివరకు ఇంగ్లీషు, గ్రీకు, లాటిన్ భాషలకు మూలంగా సంస్కృతం ఉంది. ఈ భాషలకు సంబంధించిన పదజాలాన్ని సంస్కృతమే అందించింది. ఈ ఇండో- ఆర్యన్ భాష భారతీయ ఉపఖండంలోనే కాకుండా యూరప్ ఖండానికి కూడా విస్తరించింది. ఇంత గొప్ప భాష గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ఈ రోజును జరుపుకోవడం భారతీయులకు గర్వకారణం.