Business

త్వరలోనే  ఎక్స్‌లో వీడియో ఆడియో కాల్స్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

త్వరలోనే  ఎక్స్‌లో వీడియో ఆడియో కాల్స్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

2000 నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ ఎప్పుడో గుర్తుందా?

మీ దగ్గర ఇంకా రూ. 2 వేల నోట్లు ఉన్నాయా.. వ్యాపారంలో ఇటీవలే మీ చేతికి అందాయా? అయితే, వెంటనే వాటిని మార్చేసుకోండి. ఈ నోట్లను మార్చుకోవడానికి గడువు దగ్గరపడింది. వచ్చే నెల (సెప్టెంబర్ 30) తో పెద్ద నోటను మార్చుకునే గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత మార్చుకోవడం అంత తేలిక కాదు. పైగా సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు పనిదినాల కన్నా సెలవులే ఎక్కువగా ఉన్నాయి. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే రూ.2 వేల నోట్లను మార్చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ దగ్గరున్న రూ.2 వేల నోట్లను సమీపంలోని బ్యాంకుకు తీసుకెళ్లి క్యాష్ కౌంటర్ లో ఒక దఫాలో రూ.20 వేల వరకు (10 నోట్లు) మార్చుకోవచ్చు. లేదా మీ ఖాతాలో జమ చేసుకునే వీలు కూడా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి తెచ్చిన రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 19న ఈ ప్రకటన చేసిన ఆర్బీఐ.. రూ.2 వేల నోటును మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు ఏ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోటును మార్చుకోవచ్చని తెలిపింది. దీనికి మరో 30 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

*  డ్వాక్రా మహిళలకు జగన్‌ మరో గుడ్‌ న్యూస్‌

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్‌ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తితో ఇప్పటికే ఎస్బిఐ వడ్డీ తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది.పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలుపగా… ఆ ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఇంతియాజ్ కు అందజేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇక సీఎం జగన్‌ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు

గత కొంత కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికి మన దేశంలో మాత్రం ఇంధన ధరలను తగ్గించలేదు. గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109,లీటర్ డీజిల్ ధర రూ.98.31. విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98
విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111,లీటర్ డీజిల్ ధర రూ. 99.

త్వరలోనే  ఎక్స్‌లో వీడియో ఆడియో కాల్స్‌

ఎక్స్‌ (Twitter)లో వీడియో, ఆడియో కాల్స్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఎక్స్‌ (Twitter)లో కాల్‌ సదుపాయం తీసుకురానున్నట్లు చెప్పారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకు ఫోన్‌ నంబర్‌ అవసరం లేదన్నారు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్‌ బుక్‌కు ఎక్స్‌ వేదిక కానుందని.. ఇందులో ఫీచర్లన్నీ ప్రత్యేకంగా ఉంటాయన్నారు.వీడియో కాల్స్‌ సదుపాయాన్ని తీసుకువచ్చే విషయంపై ఎక్స్‌ సీఈవో లిండా యాకరినో కొన్నిరోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సంస్థలో డిజైనర్‌గా పనిచేస్తున్న ఆండ్రియా కాన్వే కూడా వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ఎలా ఉంటుందనే విషయాన్ని నెల క్రితమే  ఓ చిత్రాన్ని షేర్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లే ఎగువన కుడివైపున ఉండే డీఎం మెనూలో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఎక్స్‌లో బ్లూటిక్‌ హైడ్‌, లైవ్‌ వీడియో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

రాకెట్ కంటే వేగంగా పెరిగిన రైల్వే స్టాక్

భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అత్యుత్తమ మల్టీబ్యాగర్ స్టాక్‌లను ప్రస్తావిస్తే, రైల్వేలకు సంబంధించిన టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు అగ్రస్థానంలో నిలబడడం ఖాయం. ఈ స్టాక్ నిలకడగా రాబడిని అందిస్తూ పెట్టుబడిదారులకు ఇష్టమైన మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ బూమ్ కొన్ని రోజులు ఆగిపోయింది.. కానీ ఈ రోజు దాని ర్యాలీ మళ్లీ వచ్చింది. టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేరు తాజాగా దాదాపు 2 శాతం లాభంతో రూ.745.40 వద్ద ముగిసింది. నిన్నటి ట్రేడింగ్‌లో 4 శాతం జంప్ చేసి రూ.758 స్థాయికి చేరుకుంది. కొన్ని రోజుల క్రితం రూ. 828.20 స్థాయిని తాకింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయిగా పరిగణించవచ్చు.టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేరు ధర దాదాపు 10 శాతం పడిపోయింది. గత 5 రోజుల్లో టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ వృద్ధి దాదాపు సమానంగా మారింది. గత ఒక నెల ప్రకారం స్టాక్ దాదాపు 15 శాతం పెరిగింది. 6 నెలల్లో ఇది 60 శాతం పెరిగింది. టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ షేర్లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 232 శాతానికి పైగా జంప్ చేసింది. గత ఒక సంవత్సరంలో ఈ వాటా దాదాపు 350 శాతం పెరిగింది. ఈ విధంగా ఈ స్టాక్ గత ఏడాదిలో అత్యుత్తమ మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి. అంటే ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.20-22 వేలు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్‌కి ఈరోజు రూ.లక్ష వచ్చేది.ఈ స్టాక్‌లో ఇటీవల ర్యాలీకి కారణం గుజరాత్‌ నుంచి కంపెనీకి వచ్చిన భారీ ఆర్డర్‌. గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జిఎంఆర్‌సి) నుంచి కంపెనీ రూ.350 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకుంది. దీని కింద అహ్మదాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 కోసం 30 స్టాండర్డ్ గేజ్ కార్ల రూపకల్పన, తయారీ, సరఫరా చేసే పనిని కంపెనీ పొందింది.

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర

మహిళలకు షాకింగ్ న్యూస్..నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు పెరిగి రూ.55,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.60,000 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్ ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,000,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,000 నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,00, 24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,000.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్

మీరు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడండి. పన్ను ఆదా తో పాటు పెన్షన్ కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను తీసుకు వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ఒకటి. గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.సెక్షన్ 80సీలో రూ.1,50,000 లిమిట్ దాటిన వాళ్లు నేషనల్ పెన్షన్ స్కీమ్‌ లో పొదుపు చేసి అదనంగా రూ.50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి 75:25, 50:50, 40:60 ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి రిటర్న్స్ మీకు వస్తాయి. ఈ స్కీమ్ లో దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. 25 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు ఈ స్కీమ్‌లో పొదుపు చేయడం మొదలు పెట్టి… నెలకు రూ.4,000 చొప్పున కనుక ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్లకు రిటైర్ అవుతారు అనుకుంటే 45 ఏళ్ల పాటు పొదుపు చేస్తూ ఉండాలి.45 ఏళ్లల్లో పొదుపు చేస్తే అప్పుడు మొత్తం రూ . 16,80,000 అవుతుంది . 9 శాతం చొప్పున రిటర్న్స్ చొప్పున రూ.99 లక్షల వడ్డీ ని వారు పొందవచ్చు. మొత్తం రూ . 1,16,57,803 జమ అవుతుంది. 35 శాతం అంటే రూ . 40 లక్షలు విత్‌డ్రా చేయచ్చు. మిగతా మొత్తం రూ . 75 లక్షలు 8 శాతం వచ్చే స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.50 వేల పెన్షన్ వస్తుంది. డబ్బులు విత్‌డ్రా చేసుకోకుండా మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే రూ.77 వేల పెన్షన్ ని మీరు పొందవచ్చు.

టీటీకే ప్రెస్టీజ్ నుంచి ఎలక్ట్రిక్ గ్రిల్లర్స్

కిచెన్​ అప్లయెన్సెస్​ కంపెనీ టీటీకే ప్రెస్టీజ్, నాలుగు వేరియంట్‌‌‌‌‌‌‌‌లతో  శాండ్‌‌‌‌‌‌‌‌విచ్ మేకర్స్, ఎలక్ట్రిక్ గ్రిల్లర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో మన్నికైన డై-కాస్ట్ అల్యూమినియం ప్లేట్లు ఉంటాయి. అదనపు స్టఫింగ్ సదుపాయం కూడా ఉంటుంది. టోస్టింగ్ కోసం నాన్-స్టిక్- కోటెడ్ ప్లేట్లను వాడినందున తక్కువ నూనె అవసరమవుతుంది. వీటి ధరలు రూ. 2,395 నుంచి రూ. 2,695 వరకు ఉంటాయి.

* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. అలాగే గృహ వినియోగ గ్యాస్ ధరలను భారీగా తగ్గించడంతో సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్: రూ. 1,155,వరంగల్: రూ. 1,17,4,విశాఖపట్నం: రూ.1, 112,విజయవాడ: రూ. 1,118,గుంటూర్: రూ. 1,114.

*   దేశ వ్యాప్తంగా నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ వ్యాప్తంగా 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఏడు నగరాల్లో ధరలు కాస్త క్షీణించాయని వెల్లడించింది. గృహరుణ సంస్థలను నియంత్రించే ఎన్‌హెచ్‌బీ బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది. గృహరుణ వడ్డీ రేట్లు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయని పేర్కొంది. అహ్మదాబాద్‌లో 9.1 శాతం, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం, చెన్నైలో 1.1 శాతం, దిల్లీలో 0.8 శాతం, హైదరాబాద్‌లో 6.9 శాతం, ముంబయిలో 2.9 శాతం, పుణెలో 6.1 శాతం వరకూ ధరలు పెరిగాయని హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (హెచ్‌పీఐ) నివేదిక పేర్కొంది. 50 నగరాల్లో ఏప్రిల్‌-జూన్‌ మధ్య బ్యాంకులు, గృహరుణ సంస్థల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా దీన్ని రూపొందించింది. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు వార్షిక సగటు వృద్ధి 4.8 శాతం ఉందని వెల్లడించింది.