Politics

పార్టీ విలీనంపై నేడు షర్మిల ప్రకటన

పార్టీ విలీనంపై నేడు షర్మిల ప్రకటన

YSRTC అధినేత్రి షర్మిల ఇవాళ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. YSRTC అధినేత్రి షర్మిల కాసేపట్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఇవాళ తన తండ్రి వర్ధంతి సందర్భంగా YSR సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.అనంతరం కాంగ్రెస్ లో YSRTC విలీనం, భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ శ్రేణులకు ఆమె సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. మొన్న ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అయ్యారు.

కాగా… అధికార BRS నుండి బయటకు వచ్చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయిన తరుణంలో గతంలో ఈయన ఎమ్మెల్యే గా గెలిచిన పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక YSRTP నుండి కాంగ్రెస్ లోకి వస్తున్న షర్మిల కూడా ఇదే స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనీ ఇంతకు ముందే చెప్పి ఉన్నారు, కానీ ఇద్దరు నాయకులు ఒకే గూటికి చేరుతారు అని ఊహించకపోవడం వలన ఇప్పుడు సందిగ్దత నెలకొంది.