ఆగస్ట్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 120.05 కోట్లు వచ్చింది TTD ప్రకటన చేసింది. తిరుమల అష్ట వినాయక అతిధి గృహాన్ని సామాన్య భక్తులుకు కేటాయించేలా వాటి ధరను 150 రూపాయలకు తగ్గిస్తూన్నామని టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. వికాస్ నిలయంలో అతిధి గృహాని 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరణ చేస్తూన్నామని చెప్పారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి.ఆగస్ట్ నెలలో 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా….హుండి ద్వారా 120.05 కోట్లు ఆదాయం లభించిందని పేర్కొన్నారు. కోటి తోమ్మిది లక్షల లడ్డులు విక్రయించాయని…43.07 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. 9.07 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారి అభిషేకాని వినియోగించే పాలను టిటిడి గోశాల నుంచి సేకరిస్తూన్నామన్నారు ఇఓ దర్మారెడ్డి.
ఆగస్ట్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతొచ్చిందంటే!
