కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 18 నుంచి 26వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న అంకురార్పణ జరగనుంది. 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది.
* 17న (ఆదివారం)- అంకురార్పణ- రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు
* 18న(సోమవారం) – బంగారు తిరుచ్చి ఉత్సవం – మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు
* ధ్వజారోహణం (మీన లగ్నం) – సాయంత్రం 6.15 గంటల నుంచి 6.30 గంటల వరకు.
* పెదశేష వాహనం – రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు
* 19న (మంగళవారం) – చినశేష వాహనం- ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు
* స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు
* హంస వాహనం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు
* 20న (బుధవారం) – సింహ వాహనం – ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు వరకు.
* స్నపన తిరుమంజనం – మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు.
* ముత్యపు పందిరి వాహనం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు.
* 21న (గురువారం) – కల్పవృక్ష వాహనం- ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు వరకు.
* సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు
* 22న (శుక్రవారం)- మోహినీ అవతారం – ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు వరకు
* గరుడసేవ – రాత్రి 7 గంటలకు ప్రారంభం.
* 23న (శనివారం)- హనుమంత వాహనం – ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు వరకు.
* సువర్ణ రథం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.
* గజ వాహనం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు.
* 24న (ఆదివారం)- సూర్యప్రభ వాహనం- ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు వరకు
* స్నపన తిరుమంజనం – మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు
* చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు
* 25న (సోమవారం)- రథోత్సవం- ఉదయం 6.55 గంటలకు.
* అశ్వ వాహనం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు.
* 26న (మంగళవారం) పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం- ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు.
* స్నపన తిరుమంజనం, చక్రస్నానం- ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు.
* ధ్వజావరోహణం – రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు.