Fashion

33 ఏళ్లుగా ఈమె జుట్టు కత్తిరించుకోలేదు

33 ఏళ్లుగా ఈమె జుట్టు కత్తిరించుకోలేదు

టెన్నిస్సీకి టేనస్సీకి చెందిన టమీ మనీస్ అనే మహిళ 33 ఏళ్లుగా హెయిర్ కట్ చేయించుకోకుండా జుట్టు పెంచుతోంది.దాంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముల్లెట్‌ను కలిగి ఉంది. ముల్లెట్ అనేది ఒక హెయిర్‌స్టైల్.ఈ హెయిర్‌స్టైల్ లో జుట్టును ముందు, ఇరు వైపులా చిన్నదిగా కట్ చేస్తారు, కానీ వెనుక భాగంలోని జుట్టును అలాగే కట్ చేయించకుండా ఉంచుతారు. దీనివల్ల ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలోని జుట్టు బాగా పెరుగుతుంది.దీనిని పెంచడంలోనూ ఇబ్బంది ఉంటుంది. టమీ మనీస్ జుట్టు 5 అడుగుల, 8 అంగుళాల పొడవు లేదా దాదాపు 172 సెంటీమీటర్లు పొడవు ఉంది. అంటే దాదాపు ఆరడుగుల పొడవు. ఆమె టిల్ ట్యూస్డే అనే ఒక మ్యూజిక్ వీడియో చూసిన తర్వాత జుట్టు కట్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అలా 1990 నుంచి దానిని పెంచుతోంది. అప్పటి నుంచి ఆమె జుట్టు కత్తిరించుకోలేదు. తన ముల్లెట్( ంఉల్లెత్ ) చాలా పొడవుగా ఉందని, దానిని జడ లాగా వేసుకోకపోతే మేనేజ్ చేయడం చాలా కష్టమని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.