గచ్చిబౌలిలోని “స్వేచ్ఛ” కార్యాలయంలో తానా ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 20 నెలలుగా ప్రతి మొదటి ఆదివారం నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి తానా ఫౌండేషన్ సహకారం అందజేస్తోందని, ప్రజాపయోగ కార్యక్రమాలకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ తెలిపారు. కాట్రగడ్డ సునీత జ్ణాపకార్ధం కాట్రగడ్డ ప్రశాంత్ మరియు శాన్వీలు నేటి శిబిరానికి దాతలుగా వ్యవహరించారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన 600మంది పేదలకు 13మంది వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి భోజనం, మందులు అందజేశారు. ఆర్థోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ తదితర విభాగాలకు చెందిన సేవలు అందించారు. “స్వేచ్ఛ” ఉపాధ్యక్షులు కిరణ్ చంద్ర తానాకు ధన్యవాదాలు తెలిపారు.