యుఏఈ దేశంలోని దుబాయ్ పట్టణంలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ‘వైఎస్ రాజశేఖర రెడ్డి’ 14వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్సీపీ యుఏఈ కమిటీ కన్వీనర్ సయ్యద్ అక్రం బాషా అండ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినారు.ఈ సందర్భంగా సయ్యద్ అక్రం బాషా మాట్లాడుతూ.. దివంగత మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణయుగం లాంటిదని ఆయన పరిపాలనలో బడుగు బాలహీన వర్గాల ప్రజలు సఖ సంతోషాలతో వున్నారని పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన అపర భగీరథుడు, జలయగ్నం సృస్టికర్త, ఆరోగ్య శ్రీ ప్రదాత, విధ్యాదాత, ఉచిత విద్యుత్ పధకం, ఫీజు రీయంబ్రస్మెంట్, ఇలా ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఏకైక ముఖ్య మంత్రి.
ముస్లింలకు ప్రభుత్వ విద్య ఉద్యోగ రంగాలలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వారిదేనని, వారు చనిపోయోటప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు పాటు పడ్డారని, రాజన్న భౌతికంగా మన ముందు లేకపోయిన తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఏఈ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.