చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 118 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, లోకేష్‌పై సీబీఐ విచారణ జరిపించి..జైల్‌కు పంపించాలని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు చేసిన అవమానాలు ప్రధాని మోడీ, అమిత్‌షాను ఇంకా మర్చిపోలేదు..దానికి బదులు ఉంటుందని ఆమె అన్నారు. రజనీకాంత్‌ను తాము విమర్శించలేదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పామన్నారు. చంద్రబాబును ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మాత్రమే వ్యతిరేకించామని మంత్రి రోజా అన్నారు. అంతకన్నా ముందు తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు.