Devotional

తిరుమలలో షారుఖ్ ఖాన్

తిరుమలలో షారుఖ్ ఖాన్

తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్‌, భార్య గౌరీ ఖాన్‌, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు.సెప్టెంబర్ 7న‌ షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.