తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల కమిటీ సభ్యులు ఇచ్చిన పేర్లపై స్క్రీనింగ్ కమిటీ నేతలతో ముఖాముఖీ చర్చించనుంది. రేపు డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈనెల 6న ప్రదేశ్ ఎన్నికల కమిటీతో చర్చించి..అభ్యర్థుల పేర్లను స్క్రీనింగ్ కమిటీ సీల్డ్ కవర్‌లో సీఈసీకి పంపనుంది.