భారతదేశంలో పక్షులు ఆత్మహత్య చేసుకునే ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా..? అవును మీరు చదివింది నిజమే..అలాంటి ఒక ప్రదేశం ఉంది. అది జటింగా అనే ఈ గ్రామం..ఈ గ్రామంలో పక్షులు పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి చేసుకుంటాయని ప్రాచుర్యంలో ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఈ ప్రదేశంలో పక్షుల ఆత్మహత్యలు
ఎక్కువగా జరుగుతున్నాయని వార్తలు వస్తుంటాయి. స్థానికంగా కనిపించే పక్షులే కాదు.. వలస పక్షులు కూడా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. భారతదేశంలోని ఆ గ్రామం పూర్తి వివరాలు ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం..
జటింగా అస్సాంలోని గౌహతికి దక్షిణాన 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ గ్రామాన్ని పక్షులు ఆత్మహత్యలకు పాల్పడే వింత గ్రామంగా పిలుస్తారు. అనేక నివేదికలు, సోషల్ మీడియా ద్వారా చాలా సందర్బాల్లో చెప్పినట్టుగా.. ఆగస్టు, నవంబర్ నెలల్లో వివిధ జాతుల పక్షులు ఇక్కడ మిస్టీరియస్‌గా చనిపోతుంటాయి. సుదూర ప్రాంతాల నుండి వసల వచ్చిన పక్షులు కూడా ఇక్కడకు వచ్చాక చనిపోతాయి.
చంద్రకాంతి లేని చీకటి రాత్రులు, అమావాస్య సందర్బాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని.. దీనికి దుష్టశక్తులు తమకు సందేశాలు పంపుతున్నాయని చాలా ఏళ్లుగా ఇక్కడి గ్రామస్థులు నమ్ముతున్నారు. వారు చెడు నుండి తమను తాము రక్షించుకోవడానికి వారి చుట్టూ వెదురు స్తంభాలను నిర్మించుకున్నారు. ఈ వింత దృగ్విషయం సాక్ష్యాన్ని అనేక జానపద కథలుగా అల్లుకుని ఇక్కడి స్థానికులు చెప్పుకుంటుంటారు. ఇన్ని పక్షులు కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాయో ఇక్కడి ప్రజలకు అర్థం కాలేదు. ఈ సంఘటనలు కొన్ని వాతావరణ పరిస్థితులతో సంవత్సరంలో ఒక సమయంలో మాత్రమే జరుగుతాయని మాత్రం గ్రామస్తులు గుర్తించారు.