NRI-NRT

ప్రపంచవ్యాప్తంగా YSR వర్ధంతి

YSR Vardhanti in Newzealand Singapore Kuwait

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్‌ వైఎస్సార్‌ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్‌ 2వ తేదీన ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్‌), ఆనంద్‌ ఎద్దుల(రీజినల్‌ కో ఆర్డినేటర్‌) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగింది.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా సింగపూర్లోని ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి వెలిగించి, వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. పేదప్రజల కోసం పరితపించిన గొప్ప నాయకుడని నెమరువేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగింది. ప్రవాసులు జ్యోతి వెలిగించి, డాక్టర్ వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ వేడుకకు తరలివచ్చిన ఫీనిక్స్‌లోని వైఎస్‌ఆర్ అభిమానులు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్‌ఆర్ సువర్ణ పాలనను గుర్తుచేసుకున్నారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు కువైట్ లో జరిగాయి. వైఎస్సార్ సిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశానుసారం కువైట్లోని, మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమీటీ సభ్యుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అభిమానులు రాజన్న 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని గల్ఫ్ కో-కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.