నెల్లూరు రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేగింది. ఒకటో ప్లాట్‌ఫామ్‌పై బాంబు పెట్టారని.. అది కొద్దిసేపట్లో పేలుతుందంటూ 112 నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశారు. ఈ పరీక్ష రైల్వేస్టేషన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు జరిగాయి.ప్రయాణికులను రైల్వేస్టేషన్ నుంచి దూరంగా పంపించి పార్సిల్ కేంద్రం, బ్యాగులను తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో ఆకతాయి పనిగా తేల్చారు. దీంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయి కోసం పోలీసులు గాలింపు.