Politics

బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

చంద్రబాబు బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో పర్యటించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కమ్మ భవన్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని.. ఒక శక్తి అని కొనియాడారు. తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. సినీ రంగంలో ఆయనకు ఆయనే సాటి అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని.. అలా జరగాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.