బంగారం కొనాలనుకొనే మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది.. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు బుధవారం కృష్ణాష్టమి(సెప్టెంబర్ 6) సందర్బంగా కాస్త తగ్గుముఖం పట్టాయి.. ఇకపోతే వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి తగ్గాయి. బుధవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,150 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.60,160 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ. 160 మేర తగ్గింది. ఇక వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరిస్తున్నాయి. బుధవారం కిలో వెండి ధర ఏకంగా రూ.1000 మేర తగ్గడం విశేషం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75, 200 పలుకుతోంది.. దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
*. ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,160వద్ద కొనసాగుతోంది.
*. కోల్కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది.
*.కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ట్రేడ్ అవుతోంది..
*. చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,490గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,160గా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,300, 24 క్యారెట్స్ ధర రూ. 60,160వద్ద కొనసాగుతోంది..
ఈరోజు వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది.. ప్రధాన నగరాల్లో ఎంత ఉందంటే..కిలో వెండిపై ఏకంగా రూ. 1000 వరకు తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 79,000గా పలుకుతోంది. చెన్నై, కేరళలోనూ ఇదే ధరకు లభిస్తోంది.. ఈరోజు కాస్త ఆశాజానకంగా ఉన్న ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..