టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఇది కూడా పెద్ద స్కామేనా అని అంటరాని ఎద్దేవా చేశారు.కాగా, చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు. వేచి చూడండి!’ అని కామెంట్స్ చేశారు.