కడప జిల్లాకు చెందిన భక్తుడు రాజారెడ్డి తిరుమల శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహూకరించారు. ఈ బంగారు పుష్పాలను లలితా జ్యూవెలరీ కంపెనీ తయారు చేసినట్టు ఆ కంపెనీ అధినేత కిరణ్ కుమార్ తెలిపారు. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పుష్పాలను తయారు చేసినట్టు వెల్లడించారు. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న రాజారెడ్డి, కిరణ్ కుమార్ స్వామివారికి బంగారు పుష్పాలను సమర్పించారు. ఈ బంగారు పుష్పాలను శ్రీవారి అష్టదళపాదపద్మారాధన సేవకు వినియోగించనున్నారు.
శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహుకరించిన భక్తుడు
![శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహుకరించిన భక్తుడు శ్రీవారికి 108 బంగారు పుష్పాలను బహుకరించిన భక్తుడు](https://i.postimg.cc/CLk8rskW/Whats-App-Image-2023-09-06-at-5-40-13-PM.jpg)