Sports

బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం

బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం

ఆసియా కప్‌‌‌‌లో ఆతిథ్య పాకిస్తాన్‌‌‌‌ జోరు కొనసాగుతోంది. అందరికంటే ముందే సూపర్4 బెర్తు దక్కించుకున్న పాక్‌‌‌‌ సొంతగడ్డపై చివరి పోరులో ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసింది. హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ (4/19), నసీమ్‌‌‌‌ షా (3/34) పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ పేస్‌‌‌‌కు తోడు ఇమామ్‌‌‌‌ ఉల్‌‌‌‌ హక్‌‌‌‌ (84 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78), మొహమ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ (79 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 63 నాటౌట్‌‌‌‌ ) బ్యాటింగ్‌‌‌‌ మెరుపులతో బుధవారం జరిగిన సూపర్‌‌‌‌–4 తొలి మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన బంగ్లాదేశ్‌‌‌‌ 38.4 ఓవర్లలో 193 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌ (64), కెప్టెన్‌‌‌‌ షకీబ్‌‌‌‌ అల్‌‌‌‌ హసన్‌‌‌‌ (53) ఫిఫ్టీలతో రాణించినా మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. అనంతరం పాక్‌‌‌‌ 39.3 ఓవర్లలోనే 194/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. రవూఫ్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. శనివారం శ్రీలంకతో బంగ్లాదేశ్‌‌‌‌ తలపడనుండగా.. ఆదివారం ఇండియాతో పాక్‌‌‌‌ పోటీ పడనుంది.

ఇమామ్‌‌‌‌, రిజ్వాన్​ ధనాధన్‌‌‌‌
చిన్న టార్గెట్‌‌‌‌ను పాకిస్తాన్‌‌‌‌ ఈజీగా ఛేజ్‌‌‌‌ చేసింది. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన ఓపెనర్లు ఫఖర్‌‌‌‌ జమాన్‌‌‌‌ (20), ఇమామ్‌‌‌‌ ఉల్‌‌‌‌ హక్ తొలి వికెట్‌‌‌‌కు 35 రన్స్‌‌‌‌ జోడించారు. ఐదో ఓవర్‌‌‌‌ తర్వాత ఫ్లడ్‌‌‌‌ లైట్స్‌‌‌‌ మొరాయించడంతో 20 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి మొదలైన తర్వాత పదో ఓవర్లో షోరిఫుల్‌‌‌‌ ఇస్లాం వేసిన లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌కు జమాన్‌‌‌‌ ఎల్బీగా ఔటవడంతో బంగ్లాకు బ్రేక్‌‌‌‌ లభించింది. ఫామ్‌‌‌‌లో ఉన్న కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 16వ ఓవర్లో తస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న ఇమామ్‌‌‌‌కు రిజ్వాన్‌‌‌‌ తోడయ్యాడు. ఈ ఇద్దరూ బంగ్లా బౌలర్లకు ఎలాంటి చాన్స్‌‌‌‌ ఇవ్వకుండా లక్ష్యాన్ని కరిగిస్తూ ముందుకెళ్లారు. హసన్‌‌‌‌ మహ్మూద్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో 6, 4తో రిజ్వాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను ఊపు తీసుకొచ్చాడు. స్పిన్నర్‌‌‌‌ మెహిదీ హసన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టిన ఇమామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తను మరింత స్పీడు పెంచాడు. షకీబ్‌‌‌‌ ఓవర్లోనూ సిక్స్‌‌‌‌ బాదాడు. మెహిదీ వేసిన 33వ ఓవర్లో 6,4 కొట్టిన అతను మరో భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసి బౌల్డ్‌‌‌‌ అవ్వడంతో మూడో వికెట్‌‌‌‌కు 85 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది. అప్పటికే మ్యాచ్‌‌‌‌ పాక్‌‌‌‌ చేతుల్లోకి రాగా.. అఘా సల్మాన్‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌)తో కలిసి రిజ్వాన్‌‌‌‌ లాంఛనం పూర్తి చేశాడు.

పేస్‌‌‌‌ దెబ్బ
మెగా టోర్నీలో పాకిస్తాన్‌‌‌‌ పేసర్లు మరోసారి సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేశారు. దాంతో, తొలి పవర్‌‌‌‌ప్లేనే 47/4తో డీలా పడ్డ షకీబ్‌‌‌‌సేన కనీసం 200 మార్కు కూడా దాటలేకపోయింది. పదునైన పేస్‌‌‌‌తో రవూఫ్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌ను వణికించగా.. నసీమ్‌‌‌‌ తన సీమ్‌‌‌‌, స్వింగ్‌‌‌‌తో మరింత డ్యామేజ్‌‌‌‌ చేశాడు. దాంతో రెండో ఓవర్లోనే బంగ్లాకు కష్టాలు మొదలయ్యాయి. గత మ్యాచ్‌‌‌‌లో సెంచరీ చేసిన మెహిదీ హసన్ మిరాజ్‌‌‌‌ (0) నసీమ్‌‌‌‌ వేసిన తొలి బాల్‌‌‌‌కే ఔటయ్యాడు. మరో ఓపెనర్ మొహమ్మద్‌‌‌‌ నైమ్‌‌‌‌ (20), లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌ (16) వెంటవెంటనే బౌండ్రీలు కొడుతూ 31 రన్స్‌‌‌‌ జోడించారు. కానీ, షాహీన్‌‌‌‌ (1/47) వేసిన ఐదో ఓవర్లో పేలవ షాట్‌‌‌‌ ఆడిన లిటన్‌‌‌‌.. రిజ్వాన్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. ఆపై రవూఫ్‌‌‌‌ రాకతో బంగ్లా కష్టాలు రెట్టింపయ్యాయి. నైమ్‌‌‌‌ అతనికి రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ఇవ్వగా.. తౌహిడ్‌‌‌‌ హ్రిదయ్‌‌‌‌ (2) క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. ఈ దశలో షకీబ్‌‌‌‌, ముష్ఫికర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడటంతో బంగ్లా 147/4తో కోలుకున్నట్టు కనిపించింది. కానీ, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత షకీబ్‌‌‌‌.. ఫహీమ్‌‌‌‌ అష్రఫ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌పై వేసిన బాల్‌‌‌‌ను పుల్‌‌‌‌ చేయబోయి ఫఖర్‌‌‌‌ జమాన్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో సెంచరీ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది. ఆ తర్వాత రవూఫ్‌‌‌‌, నసీమ్‌‌‌‌ మళ్లీ విజృంభించారు. దాంతో, 19 రన్స్‌‌‌‌ తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా ఇన్నింగ్స్‌‌‌‌ 39 ఓవర్లలోనే ముగిసింది.