Kids

కోవిడ్ చికిత్సతో చిన్నారికి నీలికళ్లు

మూవీస్ చికిత్సతో చిన్నారికి నీలికల్లు

కరోనా వైరస్‌కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌ (Thailand)లో వెలుగులోకి వచ్చింది.

COVID-19 చికిత్స పొందిన 6 నెలల బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి ముదురు నీలం రంగులోకి మారాయి. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం.. థాయిలాండ్‌‌కు చెందిన ఓ శిశువుకు జ్వరం, దగ్గు వచ్చాయి. పరీక్షలు నిర్వహించగా COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో తల్లిదండ్రులు 3 రోజుల పాటు ఫెవిపిరావిర్ ఔషధంతో చికిత్స అందించారు. అయితే మందులను ఉపయోగించిన 18 గంటల తర్వాత బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలం రంగులోకి మారిపోయాయి.

చిన్నారి తల్లి తన బిడ్డ కంటి రంగులో మార్పును గమనించి డాక్టర్‌కు చెప్పింది. దీంతో డాక్టర్ ఫేవిపిరావిర్ వాడడం ఆపేశారు. ఐదు రోజుల తర్వాత దాని బాలుడు కళ్లు నీలం రంగు నుంచి గోధుమ రంగుకు తిరిగి వచ్చాయి. దీంతో ఫెవిపిరావిర్ వాడకాన్ని ఆవేయాలని డాక్టర్ సూచించారు. చర్మం, గోర్లు, నోరు ఇతర శరీర భాగాలు నీలిరంగు రంగులోకి మారలేదు. 3 రోజుల ఫెవిపిరావిర్ థెరపీ తర్వాత కోవిడ్ లక్షణాలు తగ్గినా కళ్లలో కార్నియా రంగు మారడంతో చికిత్సను నిలిపివేయాలని సూచించాడు. ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత 5వ రోజు కళ్లు సాధారణ రంగుకు వచ్చినట్లు వైద్య నిపుణులు నివేదిక ఇచ్చారు.