నేడు బనగానపల్లె, నంద్యాలలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బనగానపల్లె లో టీడీపీ మహిళా శక్తి హామీలపై మహిళలతో చంద్రబాబు ముఖాముఖి లో పాల్గొంటారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.అలాగే.. నంద్యాల రాజ్ థియేటర్ సర్కిల్ వద్ద చంద్రబాబు బహిరంగ సభ ఉంటుంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం ఉండనుంది. కాగా.. నిన్న బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ పుట్టుక గురుంచి తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నేడు నంద్యాలకు చంద్రబాబు
