శ్రీ మహా విష్ణువు లోకకల్యాణార్థం ఎత్తిన అవతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీ కృష్ణుడు. భగవంతుడైన విష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం శ్రీకృష్ణుడుగా అవతార ఎత్తినట్లు భావిస్తారు. కంసుని దురాగతాల నుండి తన తల్లిదండ్రులను, ప్రజలను విముక్తి చేయడానికి శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడు. విష్ణువు 8వ అవతారంగా శ్రీ కృష్ణుడు 8 సంఖ్యతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాడు.
పంచాంగం ప్రకారం మనందరి జీవితంలో కొన్ని సంఖ్యలకు ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యలు జాతకంలో కూడా లోతైన ప్రభావాన్ని చూపుతాయి. జాతకం ప్రతి గ్రహానికి ఒక సంఖ్య ఉంటుంది. ఎనిమిదవ సంఖ్య శనీశ్వరుడికి చెందినది. శ్రీ కృష్ణుడికి 8వ సంఖ్యతో గాఢమైన అనుబంధం ఉంది. ఈ రోజు ఎలాగో తెలుసుకుందాం..
8 సంఖ్యతో కృష్ణుడి మధ్య సంబంధం
హిందూ మతంలో శ్రీ విష్ణువు భూమిపై పది అవతారాలు ఎత్తినందున దశావతారి అని పిలుస్తారు. శ్రీ కృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారం. కాబట్టి సంఖ్య 8 చాలా ప్రత్యేకమైనది.
శ్రీ కృష్ణుడు జన్మించిన రోజు రాత్రి ఏడు ముహూర్తాలు గడిచి ఎనిమిదవ ముహూర్తంలో భగవంతుడు జన్మించాడు. ఆ సమయంలో రోహిణి నక్షత్రం, అష్టమి తిథి కూడా ఉన్నాయి.
శ్రీ కృష్ణుడు పుట్టకముందే, దేవకి, వసుదేవుల ఎనిమిదవ సంతానం ద్వారా కంసుడు వధింపబడతాడని భవిష్యవాణి చెప్పింది. దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు. తన మేనమామ కంసుడిని వధించాడు.
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు. అంతేకాదు కన్నయ్యకు 16,100 మంది గోపికలున్నారు. ఈ సంఖ్య మొత్తం కూడా 8.
శ్రీ కృష్ణుడి ఉపదేశం అని పిలువబడే పవిత్ర గ్రంథం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం , చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం తాను ప్రతి యుగంలో అవతరిస్తానని.. ధర్మాన్ని స్థాపిస్తానని చెప్పాడు.
శ్రీ కృష్ణ భగవానుడు భూమిపై 125 సంవత్సరాలు జీవించాడు. మొత్తం మొత్తం 8 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం అన్ని గ్రహాలకు ఉన్నట్లే శనీశ్వరుడికి సంఖ్య 8 వ సంఖ్య. బహుశా అందుకే శనీశ్వరుడి , శ్రీ కృష్ణుడికి ప్రత్యేకమైన సంబంధం ఉంది.