తెలంగాణ ప్రాంత రోడ్డు రవాణా చరిత్రకు సాక్ష్యం ఈ బస్సు..తొలిసారి హైదరాబాద్ గడ్డపై నడిచిన ఆర్టీసీ బస్సు.. చరిత్ర మిగిల్చిన గుర్తులకు ఆనవాళ్లుగా ఇప్పటివరకు ముషీరాబాద్ లోని బస్ భవన్లో ఉంచారు.. ఇప్పుడు ఎంజీబీఎస్ మ్యూజిఎంలో అందరిని ఆకట్టుకోనుంది.
హైదరాబాద్ రోడ్డు రవాణ సంస్థలో మొట్టమొదటి నిజాం ఐకానిక్ బస్సు.. అల్బియాన్ రెడ్ బస్సును ఇప్పుడు మహాత్మాగాంధీ బస్ స్టేషన్( ఎంజీబీఎస్) ఆవరణలోని మ్యూజిఎం కు తరలించనున్నారు. ఇప్పటి వరకు ఇది అల్బియాన్ బస్సును ముషీరాబాద్‌లోని బస్ భవన్ వెలుపల పార్క్ చేశారు. యువతరానికి రోడ్డు రవాణ సంస్థ చరిత్ర, ప్రయాణ వారసత్వాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ చారిత్రక బస్సును తరలించనున్నారు.
1932లో UKకి చెందిన అల్బియాన్ మోటార్స్ సంస్థ ఈ బస్సును తయారు చేసింది. 1932లో హైదరాబాద్ సంస్థానంలో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రారంభించిన 27 బస్సులలో మొదటి బస్సు అల్బియాన్ రెడ్ బస్సు.. ఇది నిజాం స్టేట్ లో రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది. తొలిసారి ఈ బస్సును నాండేద్ మార్గంలో నడిపించారు. ఈ బస్సులో డ్రైవర్, కండక్టరుతో సహా 19 మంది ప్రయాణించే వసతి ఉంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న అల్బీయన్ రెడ్ బస్సులను చారిత్రాత్మక వాహనంగా ఇప్పుడు ఎంజీబీఎస్ మ్యూజిఎంలో పార్క్ చేయనున్నారు.
హైదరాబాదు సంస్థానంలో రవాణా విభాగం రైల్వే కింద నిర్వహించబడింది..RTC 27 బస్సులను కలిగి ఉంది. మొదట 166 మంది ఉద్యోగులను నియమించారట..రాబోయే రోజుల్లో ఎంజీబీఎస్ మ్యూజియంలో అల్బియాన్ రెడ్ బస్సు దాని చారిత్రక ప్రాముఖ్యత, హైదరాబాద్ సంస్థాన్ ప్రాంత రవాణా వారసత్వానికి సహకారం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది.