జకార్తాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్‌కు చేరుకున్న ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ప్రధాని మోడీకి స్వాగతం చెప్పారు. ప్రధాని మోడీ కోసం హోటల్ వద్ద వేచి ఉన్న భారతీయ ప్రవాసులు “మోడీ, మోడీ” అంటూ నినాదాలు చేస్తూ.. మనకు ఎలాంటి నాయకుడు కావాలి? మోడీజీలా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం అంటూ జాతీయ జెండాను చేతపట్టుకుని ప్రధానికి బ్రహ్మ రథం పట్టారు
ఆసియాన్-భారత్ 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ గురువారం తెల్లవారు జామున ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టిన ప్రధాని మోడీకి ఇండోనేషియా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుస్టీ ఆయు బింటాంగ్ ధర్మావతి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇండోనేషియా సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ప్రధాని మోడీ రాకకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ జకార్తాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్‌కు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ప్రధాని మోడీకి స్వాగతం చెప్పారు. ప్రధాని మోడీ కోసం హోటల్ వద్ద వేచి ఉన్న భారతీయ ప్రవాసులు “మోడీ, మోడీ” అంటూ నినాదాలు చేస్తూ.. మనకు ఎలాంటి నాయకుడు కావాలి? మోడీజీలా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం అంటూ జాతీయ జెండాను చేతపట్టుకుని ప్రధానికి బ్రహ్మ రథం పట్టారు. హర్ హర్ మోడీ హర్ ఘర్ మోడీ భారీ సంఖ్యలో వచ్చిన చిన్నారులు, మహిళలు నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో ప్రధానికి స్వాగతం పలికారు.
అంతేకాదు తాము తెల్లవారుజామున 03:00 గంటలకు ఇక్కడికి వచ్చి మేము మా ప్రధాని మోడీ కోసం ఆసక్తిగా ఎదురుచూసినట్లు హోటల్ వద్ద ప్రధాని మోడీ కోసం వేచి ఉన్న భారతీయ ప్రవాస సభ్యులలో ఒకరు చెప్పారు . తాము తమిళ సంఘం నుండి వచ్చాము. మోడీజీకి స్వాగతం పలకడానికి మేము రాత్రి 10:00 గంటల నుండి ఇక్కడ వేచి ఉన్నామని. ఇప్పుడు ప్రధాని మోడీకి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రధాని మోడీ పర్యటనలో భారతదేశం, ఇండోనేషియా మధ్య మరింత బలపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని వెల్లడించారు. ప్రధాని కోసం చిన్న పిల్లలు కూడా హోటల్ వద్ద వేచి చూశారు.
ఈ రోజు ఇండోనేషియాకు చేరుకున్న ప్రధాని మోడీ బిజీ షెడ్యూల్ ను కలిగి ఉన్నారు. కొన్ని గంటల తర్వాత భారతదేశం-ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని.. తర్వాత 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రధాని మోడీ న్యూఢిల్లీకి చేరుకుంటారు. సెప్టెంబరు 9 , 10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిత్ కు ముందు ప్రధాని మోడీ గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి తిరిగి రానున్నారు.