Business

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు-TNI నేటి వాణిజ్య వార్తలు

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు-TNI నేటి వాణిజ్య వార్తలు

* పతనమైన టమాటా ధర

మొన్నటి వరకూ చుక్కలను అంటిన టమాటాల ధర నేడు పాతాళానికి పడిపోయింది. కిలో రూ.200 నుంచి క్వింటాల్ రూ.200 వరకు దిగజారింది. దీంతో టమాట రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే పొలం నుంచి మార్కెట్ కు చేర్చడానికి అయిన రవాణా ఖర్చులకు కూడా గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టామాటాల ధర క్వింటాలుకు రూ.100 నుంచి రూ.200 మధ్యలో పలుకుతోంది. ఈ ధరకు అమ్ముకోలేక, పంటను నిల్వ చేసుకోలేక రైతులు విలవిలలాడుతున్నారు.రిటైల్ మార్కెట్లలో మాత్రం కిలో టమాటాల ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో గిట్టుబాటు ధర పలకడంలేదన్నారు. ఎరువులు, సాగు, కూలీ ఖర్చుల సంగతి పక్కన పెడితే పండించిన పంట మొత్తం అమ్మినా రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. దీంతో సాగు ఖర్చులకు అదనంగా ఈ రవాణా ఖర్చుల భారానికి భయపడి కొంతమంది రైతులు టమాటాలను రోడ్లపైన పారబోస్తున్నారు. ఇంకొంతమంది రైతులు పంటను పొలాల్లో అలాగే వదిలేస్తున్నారు. కాగా, పెద్ద మొత్తంలో టమాటా నిల్వలు మార్కెట్లకు చేరడంతో ధరలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

* క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు

కార్డ్‌లెస్, క్యాషె‌లెస్ నగదు లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏటీఎంలలో కార్డ్‌లెస్ నగదు లావాదేవీల దిశగా బ్యాంకులు, పిన్‌టెక్ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. కార్డులు అవసరం లేకుండా నగదును విత్ డ్రా చేసుకునేలా ఏటీఎంలలో కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. దీని వల్ల మీ దగ్గర డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకపోయినా మొబైల్ ఓటీపీ లేదా, యాప్స్ ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని తీసకొస్తున్నాయి. ఇందుకోసం యూపీఐ ఏటీఎంలను తీసుకొస్తున్నారు. తాజాగా ముంబైలో తొలి యూపీఐ ఏటీఎం ప్రవేశపెట్టారు. జపాన్‌కు చెందిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనే సంస్థ హిటాచీ మనీస్పాట్ ఏటీఎం పేరిట దీనిని ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ఏటీఎంను రూపొందించగా.. సెప్టెంబర్ 5న ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ సమావేశంలో దీనిని ఆవిష్కరించింది.ప్రస్తుతం ముంబైలో ఈ యూపీఐ ఏటీఎంను అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌లోని యూపీఐ యాప్‌ ద్వారా స్కాన్ చేయాలి. అనంతరం యూపీఐ పిన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. ఈ విధానం ద్వారా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. దీని వల్ల డెబిట్ కార్డు మోసాలు తగ్గుతున్నాయి. చాలామంది బ్యాంకు ఖాతాదారులకు చెందిన కార్డులను క్లోనింగ్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి తరహా మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్ల వల్ల సైబర్ నేరగాళ్ల మోసాలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా బ్యాంకు ఖాతాదారులు ఈజీగా, అత్యంత వేగవతంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

* ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పెంపు

ఆధార్‌ (Aadhaar) వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్‌ వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువును విశిష్ట గుర్తింపు ప్రాధికారి సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. సెప్టెంబర్‌ 14తో ఈ గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలల గడువు పొడిగించింది. అంటే 2023 డిసెంబర్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. గడువు తర్వాత ఆధార్‌ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఆధార్‌ పోర్టల్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోనేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. సెప్టెంబర్‌ 14తో గడువు ముగియాల్సి ఉండగా ప్రజల సానుకూల స్పందన వస్తుండడంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నాం. మైఆధార్‌ పోర్టల్‌ ద్వారా 2023 డిసెంబర్‌ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు’’ అని ఉడాయ్‌ ఆఫీసు మొమోరాండంలో పేర్కొంది.ఆధార్‌ను వివరాలు నమోదు చేసుకోవడంలో భాగంగా పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, అడ్రస్‌ వివరాలను నిర్దేశిత గడువు వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అలానే ఆధార్‌ తీసుకుని 10 ఏళ్లు పూర్తయిన వారూ తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచిస్తోంది. ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయినప్పుడు గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా వివరాలు అప్‌డేట్‌ చేయని వారు దీనిని వినియోగించుకోవాలని సూచిస్తోంది. ఇందుకోసం ఐడెంటీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్‌డేట్‌ సులువుగా ఇలా..ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి ముందుగా మై ఆధార్‌ పోర్టల్‌కు వెళ్లండి.డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ విభాగంంలో పేరు/ జెండర్‌/ పుట్టిన తేదీ/ అడ్రస్‌ అప్‌డేట్‌ ఆప్షన్లలో మీకు కావాల్సింది ఎంచుకోండి.తర్వాత అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఎంచుకోండి.తర్వాత సంబంధిత పత్రాలకు స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయండి.14 అంకెల Update request number వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.

* రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు

మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్నటితో (బుధవారం) పసిడి ధరను పోల్చి చూసినట్లియితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.150లు తగ్గి రూ. 55, 000గా ఉంది. ఇదిలా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి ప్రస్తుతం రూ. 60,000 గా కొనసాగుతోంది.నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55000,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,000.

* TCS: జేఎల్‌ఆర్‌తో రానున్న ఐదేళ్లకుగాను 8,300 కోట్ల రూపాయల డీల్‌

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) మెగా డీల్‌ కుదుర్చుకుంది. టాటామోటార్స్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)తో మెగా డీల్‌ను గెలుచుకున్నట్లు ప్రకటించింది. భవిష్య డిజిటల్‌ సేవల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది.జేఎల్‌ఆర్‌తో రానున్న ఐదేళ్లకుగాను రూ.8,300 కోట్ల( 1 బిలియన్‌ డాలర్ల) కొత్త భాగస్వామ్య డీల్ జరిగినట్లు టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త భవిష్యత్-సిద్ధమైన, వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణాన్ని రూపొందించే క్రమంలోఈ డీల్‌ ‘రీఇమాజిన్’ వ్యూహానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది.టీసీఎస్‌ సేవల్లో అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్‌ మెయింటెనెన్స్, ఎంటర్‌ప్రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్‌ డేటా సర్వీసెస్ లాంటివి ఉన్నాయి. ఈ డీల్‌పై ఇదరు సంస్థలు సంతోషాన్ని ప్రకటించాయి. అనిశ్చిత డిమాండ్ వాతావరణం, కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లేక ఐటీ మేజర్‌లు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో టీసీఎస్‌ ఐరోపాలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో గెలిచిన ఆరవ ప్రధాన ఒప్పందం కావడం విశేషం.

నేడు పెట్రోల్ డీజిల్ ధరలు

గత కొంతకాలం నుంచి ప్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల 1వ తారీకున వీటి ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ. 109 గా ఉంది. ఇక డీజిల్ ధర చూసినట్లయితే రూ. 97 గా ఉంది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ. 109,లీటకం డీజిల్ ధర రూ. 98.నేడు పెట్రోల్, డీజిల్ ధరలు.. విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ.110,లీటకం డీజిల్ ధర రూ.98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.లీటకం డీజిల్ ధర రూ. 99.

* చవకైన ధరలో ఓలా

బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా నుంచి వచ్చిన ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ ను ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఆవిష్కరించారు. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితం భవిష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ పై కూర్చొని దిగిన ఫోటోను షేర్ చేశారు.ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అత్యాధునిక సాంకేతికతను స్కూటర్లలో మిక్స్ చేస్తూ వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను తీసుకొస్తుండటంతో వీటిని మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే అత్యంత చవకైన సరికొత్త ఓలా స్కూటర్ ను ఇటీవల లాంచ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా నుంచి వచ్చిన ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ ను ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఆవిష్కరించారు. త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితం భవిష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ పై కూర్చొని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. దానికి ఆయన ఒక్కరే స్కూటర్ పై దిగిన ఫొటో కాగా, మరొకటి తన బృందం కలిసి దిగిన ఫొటో కావడం విశేషం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఓలా కొత్త స్కూటర్ ఎస్1ఎక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..ఓలా ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న ఈ కొత్త చవకైన స్కూటర్ ఓలా ఎస్1ఎక్స్ మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 79,999కాగా ప్రస్తుతం దీన ధర రూ. 89,999గా ఉంది. 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఎస్1ఎక్స్ వస్తున్న వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 89,999కాగా, ఇప్పుడు రూ.99,999గా ఉంది. అది విధంగా ఎస్1ఎక్స్ ప్లస్ మోడల్ ధర ప్రారంభంలో రూ.99,999కాగా, ఇప్పుడు దాని ధర రూ. 1,09,999గా ఉంది.

* హైదరాబాద్-ఊటీ సరికొత్త టూర్ ప్యాకేజీ 

మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఊటీకి వెళ్లి వచ్చేయచ్చు. సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ తో తక్కువ ధరలోనే ఊటీ వెళ్లి వచ్చేయచ్చు. సరికొత్త ఆఫర్స్ ఎప్పటికప్పుడు ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వస్తూనే వుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తమిళనాడు లోని పలు ప్రాంతాలను చూసేందుకు ఓ టూర్ ప్యాకేజీని తీసుకు రావడం జరిగింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకు రావడం జరిగింది.ఊటీ, కున్నూర్ వంటివి కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ జనవరి 25, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఇక ఈ ప్యాకేజీ ఎలా సాగుతుందో చూద్దాం.. మొదటి రోజు ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం లో ఫ్లైట్ ఎక్కాలి. హోటల్ లోకి చెకిన్ అయ్యాక ఆదియోగి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాలి. రాత్రి ఊటీలోనే స్టే చేయాలి.మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం ని చూడవచ్చు. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కి వెళ్ళాలి. రాత్రికి ఊటీలోనే స్తే చేయాలి. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం తో పాటుగా పైకారా ఫాల్స్ కి వెళ్ళచ్చు. రాత్రికి ఊటీలో స్టే చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కి తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే ఉండాలి. అలానే పైకారా జలపాతం, సినిమా షూటింగ్ పాయింట్ ఇవన్నీ కూడా ఇందులోనే కవర్ అవుతాయి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.24850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25450గా ఉంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.

* యూపీఐ పేమెంట్స్‌ మరింత సులవు

భారత్‌ డిజిటల్‌ చెల్లింపులో క్రమంగా తన వాటాను పెంచుకుంటూ పోతోంది.. కరోనా మహమ్మారి తర్వాత ఇవి మరింత పెరిగాయి.. ఇక, యూపీఐ పేమెంట్స్‌లోనూ డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్నాయి.. ఇప్పటి వరకు ఎవరికైనా పేమెంట్స్‌ చేయాలంటే సంబంధిత మొత్తాన్ని టైప్‌ చేయాల్సి ఉండేది.. ఇప్పుడు వాయిస్‌ ఆధారిత పేమెంట్స్‌ సహా పలు కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆవిష్కరించింది. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ సందర్భంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో హెలో! యూపీఐ అనే విధానంతో యాప్స్, టెలికం కాల్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాల ద్వారా వాయిస్‌ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేసే వెసులుబాటు కలుగుతుంది.. ప్రస్తుంది ఈ సేవలు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించనున్నట్టు ఎన్‌పీసీఐ పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీఐ సదుపాయంపై క్రెడిట్ లైన్ కస్టమర్‌లు యూపీఐ ద్వారా బ్యాంకుల నుండి ముందస్తుగా మంజూరు చేసిన క్రెడిట్‌ను యాక్సెస్ చేయగలదని NPCI తెలిపింది. విడిగా, వినియోగదారులు ఇతర ఉత్పత్తి, LITE X ఉత్పత్తిని ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో డబ్బును పంపగలరు మరియు స్వీకరించగలరు. ఇంకా, UPI ట్యాప్ మరియు పే సదుపాయం, సాంప్రదాయ స్కాన్-అండ్-పే పద్ధతితో పాటు, కస్టమర్‌లు తమ చెల్లింపులను పూర్తి చేయడానికి వ్యాపార స్థానాల్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్- (NFC-) ప్రారంభించబడిన QR కోడ్‌లను నొక్కడానికి అనుమతిస్తుంది. NPCI ప్రకారం, ఉత్పత్తులు కలుపుకొని, స్థితిస్థాపకంగా మరియు స్థిరమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను సృష్టించడం మరియు UPI నెలకు 100 బిలియన్ లావాదేవీల లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎన్‌పిసిఐ అడ్వైజర్ మరియు ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని, ఎన్‌పిసిఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిశ్వమోహన్ మహాపాత్ర కూడా లాంచ్‌లో పాల్గొన్నారు.

*  నేడు సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత గృహ వినియోగ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరట కలిగించిన విషయం తెలిసిందే. అలాగే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లను తగ్గించారు. హైదరాబాద్: రూ. 966.వరంగల్: రూ. 974.విశాఖపట్నం: రూ. 912.విజయవాడ: రూ.927.గుంటూర్: రూ. 944.