Politics

నంద్యాలలో చంద్రబాబు అరెస్టు

నంద్యాలలో చంద్రబాబు అరెస్టు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు నంద్యాలలో బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. ఘటనా స్తలానికి టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును కలువ నీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టిడిపి నాయకులు వాగ్వివాదానికి దిగారు .

తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలువండి అంటూ అధికారులతో టిడిపి నాయకులు వాధించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబును కలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు వచ్చిన సిట్ అధికారులు.

చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించిన పోలీసులు. చంద్రబాబు పాటు పలువురు టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.