Politics

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్ కంటే ఆధ్వాన్నంగా తయారైంది. ముఖ్యమంత్రి నుంచి వార్డు కౌన్సిలర్ దాకా బందోబస్తు కావాలంటే హోంగార్డు కావాలని లేఖలో వివరించారు.కుటుంబాలను పట్టించుకోకుండా ఎస్సై నుంచి ముఖ్యమంత్రి వరకు కంటికి రెప్పలా కాపాడుతుంటే వారిని సమస్యలను పరిష్కారించాలనే సోయి ఏఒక్కరికి లేకపోవడం బాధాకరం అన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారులు, తోటి సిబ్బంది వేధింపులతో హోంగార్డు రవీందర్ అత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని కలిగిచిందని ఈ లేఖలో తెలిపారు.

రవీందర్ భార్య సంధ్య, పిల్లలు మనీశ్‌ (16), కౌశిక్‌ (13) వీరికి దిక్కెవరు. ఇంత జరిగిన ఏ ఒక్క మంత్రిగాని, అధికారిని స్పందిచకపోవడం మరింత దారుణమన్నారు. రవీందర్ ది అత్మహత్య కాదు ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే. మీ ప్రభుత్వ చేతగానితనంతో నిజాయితీ పరుడైన ఒక హోంగార్డు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం చాలా బాధాకరం. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్యే. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని ఫైర్ అయ్యారు రేవంత్‌ రెడ్డి.