Movies

ప్రముఖ దర్శక నటుడు మారిముత్తు మృతి

ప్రముఖ దర్శక నటుడు మారిముత్తు మృతి

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ డైరెక్టర్‌, నటుడు జి. మారిముత్తు (57) (G Marimuthu) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఇప్పటి వరకూ వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక చివరగా ఆయన రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’లో కనిపించారు. విలన్ గ్యాంగ్‌లో ప్రధాన వ్యక్తి పాత్ర పోషించారు. వెండితెరపై విభిన్న పాత్రలతో అలరించిన మారిముత్తు.. బుల్లితెరపై పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. అలాగే దర్శకుడిగా మూడు సినిమాలు తీశారు. మారిముత్తు మృతిపై అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.