టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతోమంది అభిమానులున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు కూడా మహీ అంటే ఇష్టమేనట. అందుకే ధోనీ అమెరికాలోనే ఉన్నాడని తెలుసుకునే అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి గోల్ఫ్ (Golf) గేమ్ కూడా ఆడారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు (Viral Video) ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ధోనీ కోసం ట్రంప్ ప్రత్యేకంగా గోల్ఫ్ గేమ్ ఏర్పాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్‌తో ధోనీ ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై మహీ అభిమానులు స్పందిస్తూ.. ‘అమెరికాలోనూ తలా మేనియా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.అమెరికా వెకేషన్‌లో ఉన్న ధోనీ.. ఇటీవల యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ గేమ్‌లను వీక్షించాడు. కార్లోస్ అల్కరాస్, జ్వెరెవ్ మధ్య జరిగి పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను ధోనీ గ్యాలరీలో కూర్చుని వీక్షించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.