Food

మునగాకుతో ఆరోగ్యవంతమైన కేశాలు

మునగాకుతో ఆరోగ్యవంతమైన కేశాలు

జుట్టును హెల్దీగా ఉంచడంలో.. తిరిగిన జుట్టును తీసుకు రావడంలో మునగాకు బాగా హెల్ప్ చేస్తుంది. మరి మునగ ఆకును ఎలా వాడాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగ ఆకు మెత్తని పేస్ట్ లేదా మునగ ఆకు పౌడర్, ఆకుల రసం అయినా పర్వాలేదు. దీనికి ఒక స్పూన్ బాదాం ఆయిల్, ఒక ఆలోవెరా జెల్ ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని.. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్క సారైనా చేస్తే ఫలితం కనబడుతుంది. దీంతో జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా పట్టు కుచ్చులా, మెత్తగా తయారవుతుంది.
ఇవి కూడా చదవండి

మనం నిత్యం జుట్టుకు రాసుకునే ఆయిల్స్ ని కొద్దిగా తీసుకోండి. కొబ్బరి నూనె అయినా బాదం ఆయిల్ అయినా పర్వా లేదు. దీనికి రెండు, మూడు చుక్కల మునగ ఆకుల ఆయిల్ ను చేర్చండి. వీటిని బాగా మిక్స్ చేసి.. నార్మల్ ఆయిల్ ఎలా జుట్టు రాస్తారో అలానే రాసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి. ఇలా ఒక గంట తర్వాత తల స్నానం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఉంటే.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు కూడా ఒత్తుగా తయారవుతుంది.