* చంద్రబాబుకు రిమాండ్.. ప్రతి మండలంలో 144 సెక్షన్. తెదేపా అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీసుల కీలక ఆదేశాలు. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసు శాఖ ఆదేశాలు.
* బ్రిటన్‌లో కొందరు చైనీయులు నిఘా కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇటీవల వెలుగు చూశాయి. ఇద్దరు వ్యక్తులు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు బ్రిటన్ మీడియా పేర్కొనడం అక్కడ సంచలనం రేపింది. ఇలా బ్రిటన్ పార్లమెంటరీ ప్రజ్వాస్వామ్యంలో చైనా జోక్యంపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ఈ విషయాన్ని చైనా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
* పింఛను పంపిణీలో ఓ మహిళా వాలంటీరు చేతివాటం ప్రదర్శించారు. వైయస్‌ఆర్ జిల్లా చెన్నూరు మండలం కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన నాగేష్ రెండేళ్ల కిందట సామాజిక పింఛను కోసం స్థానిక వాలంటీరు అను వద్ద దరఖాస్తు చేశారు. తొలుత మంజూరైనా నగదు చెల్లించలేదు. సమస్యను స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెండు నెలల కిందటే ఆయనకు కొత్తగా పింఛను మంజూరైంది. తమ వల్లే పింఛను మంజూరైందని, రూ.3 వేలు చెల్లించాలని వాలంటీరు కోరారు. అంత మొత్తం ఒక్కసారిగా ఇచ్చేంత స్తోమత తనకు లేదని చెప్పడంతో నెల వారీ పింఛనులో వాలంటీరు కొంత మొత్తం తీసుకునేందుకు పింఛనుదారుతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 1న చెల్లించాల్సిన రూ.2,750 పింఛనులో రూ.వెయ్యి తగ్గించి ఇచ్చారు. దీనిపై ప్రశ్నిస్తే మళ్లీ తొలగిస్తారనే భయంతో బాధితుడు మౌనం వహించారు. మండల వ్యాప్తంగా నూతనంగా మంజూరైన 127 పింఛన్లలోనూ ఇదే రకం వాటాల దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో సురేష్‌ను వివరణ కోరగా విచారణ చేపడతామన్నారు.
* మద్యం మత్తులో ఉన్న భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి రోడ్డుపక్కన ఉన్న గొయ్యిలో పడేసింది. ఎవరికీ తెలియదులే అనుకుంది. కానీ నిఘా నేత్రాలు వారి పాపాన్ని పోలీసులకు పట్టించాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది.
* మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు దుండగులు. వేణు అనే వ్యక్తిని షిఫ్ట్ కారుతో ఢీకొట్టి… ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు వద్ద శనివారం (సెప్టెంబర్ 9న) ఈ ఘటన జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేణు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు టూవీలర్ పై వెళ్తున్న వేణును వెంటాడి కారుతో ఢీ కొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో వేణు మెడ భాగంలో తీవ్ర గాయాలై.. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
* కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు. తమిళనాడుకు చెందిన గోవింద్ రాజ్ అనే ఖైదీ శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయినట్లు పోలీసులు శనివారం తెలిపారు. గోవింద్ రాజ్ పలు చోరీ కేసుల్లో దోషి. జైలు ఆవరణలోనే గార్డెనింగ్ పనుల కోసం ఖైదీలను ప్రధాన కాంప్లెక్స్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా అతను తప్పించుకున్నాడు. “మెయిన్ బ్లాక్ నుంచి జైలు కాంప్లెక్స్‌లోని గార్డెన్ ప్రాంతానికి తీసుకెళ్లిన ఖైదీలలో అతను ఉన్నాడు. గార్డులు చూడనప్పుడు అతను తప్పించుకున్నాడు” అని వియ్యూరు పోలీసులు తెలిపారు.
* త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భాఘెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్నీ పార్టీలు నిర్వహించే కార్యకలాపాలకు భద్రత కల్పించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి బీజేపీ నక్సల్స్ ప్రభావిత దంతేవాడ ప్రాంతంలో పరివర్తన యాత్ర చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి ఆ పార్టీ గత వారం లేఖ రాసింది. బస్తర్ రీజియన్ పరిధిలో తమ నేతల హత్యలు జరుగుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని పేర్కొంది. దీనిపై సీఎం భూపేష్ భాఘెల్ స్పందించారు. ‘2013 ఎన్నికల ముందు ఝీరాం ఘట్టి వద్ద మేం మా నాయకులను కోల్పోయాం. అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది అని తెలిపారు.
* పేస్‌బుక్ వేదికగా మహిళకు పరిచయమై బాయ్‌ఫ్రెండ్‌గా మారిన వ్యక్తి ఆమె కష్టార్జితాన్ని దోచుకున్నాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన మహిళను నిలువునా మోసగించాడు. గత ఏడాది అక్టోబర్‌లో తనకు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో మహిళ సన్నిహితంగా మెలిగింది. తన పేరును అలిస్‌గా పరిచయం చేసుకుని ఫేస్‌బుక్ బాయ్‌ఫ్రెండ్‌తో మహిళ చాట్ చేసింది. ఆ వ్యక్తి నిజాయితీపరుడని, అర్ధవంతమైన సంబంధం కోసం చూస్తున్నాడని మహిళ భావించింది. వీరిద్దరూ పలుమార్లు వీడియో కాల్స్‌లో కూడా మాట్లాడుకోవడంతో అతడిని పూర్తిగా నమ్మింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిందితుడు పలు కారణాలతో అలిస్‌ను డబ్బు పంపాలని కోరాడు. పలుమార్లు ఆమె నిందితుడి బ్యాంక్ ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. అలిస్‌ను చూసేందుకు అమెరికా రావాల్సి ఉండగా తను రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్నానని నిందితుడు చెప్పడంతో ఆమెకు మోసపోయాననే అనుమానం కలిగింది. ఆ సమయంలో తాను మోసపోయానని గ్రహించానని అలిస్ వాపోయింది.