ప్రస్తుతం పువ్వులు మనిషి నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రతి రోజు గుడికెళ్లాలన్నా, స్త్రీలు అలంకరించుకోవాలన్నా పూలు అవసరం. అయితే దేవాలయాల్లో ఎక్కువ పువ్వులు వినియోగిస్తారు. వీటిని ఒకటి రెండు రోజుల్లో తీసి బయట పడేస్తుంటారు. అలాంటి వాటిని ఉపయోగించి సువాసనలు వెదజల్లె అగరుబత్తీలు తయారు చేయవచ్చు. వాడిపోయిన పూలను వృధాగా చెత్తలో పడేసినా లేదా నీటిలో పడేసినా ఎక్కువ కలుషితం అవుతుంది. కావున అలా వృధాగా పోనీయకుండా వాటిని ఎండబెట్టి, సువాసనల కోసం కొన్ని రసాయనాలు చల్లి అగరుబత్తీలు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.
వాడిపోయిన పూలను ఉపయోగించి భరత్ బన్సాల్ అనే వ్యక్తి సుర్భి అండ్ రాజీవ్‌లతో కలిసి నిర్మాలయ సంస్థను స్థాపించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీరు కేవలం అగరుబత్తీలు మాత్రమే కాకుండా దూపం ఉత్పత్తులను తయారు చేసి దేశం మొత్తం విక్రయిస్తున్నారు. గత ఏడాది వీరు సంవత్సరానికి రూ. 2.6 కోట్లు ఆదాయం పొందారు. 2024 నాటికి రూ. 20 కోట్ల వార్షిక ఆదాయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.