పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన స్టార్ ఆటగాడు జకోవిచ్ తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ను చిత్తుచేసి 24వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్(24) సమం చేశాడు. ఫైనల్ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినప్పటికీ 6-3, 7-6(7-5), 6-3 తేడాతో జకోవిచ్ వరుస సెట్లలో మెద్వెదెవ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. 2021లో ఇదే యూఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ను ఒడిసిపట్టిన మెద్వెదెవ్ ఈసారి మాత్రం బోల్తా పడ్డాడు. ఈ విజయంతో జకోవిచ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.
పగ తీర్చుకున్న జకోవిచ్. చిత్తుగా ఓడిన మెద్వెదెవ్.
Related tags :