వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. బైక్‌పై రయ్‌రయ్ మని తిరగాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. అయితే నిత్యం హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఇదే కారణంగా యువత హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. హెల్మెట్‌కి, బట్టతలకి ఎలాంటి సంబంధం లేదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి నుంచి జుట్టు పొడిపారకుండా ఉంటుంది. అయితే ఎక్కువసేపు ధరిస్తే మాత్రం తలలో వేడి పెరిగి దాని వల్ల జుట్టులో చెమటకి దారితీస్తుంది.నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు కాపాడటమే కాకుండా జుట్టుకు ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. అందుకే మంచి సౌకర్యవంతమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి.
హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా?
Related tags :