ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రాసే సెటిల్‌మెంట్ దస్తావేజులో ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు పేర్కొంటే, ఆ పిల్లలు తమకు హామీ ఇచ్చిన విధంగా తమ సంరక్షణ బాధ్యతలను నెరవేర్చకపోతే, ఆ ఆస్తిని ఏకపక్షంగా తిరిగి ఆ తల్లిదండ్రులు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే…పిల్లల నుండి ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు
Related tags :