Movies

పుష్ప-2 గురించి ప్రియమణి కామెంట్స్

పుష్ప-2 గురించి ప్రియమణి కామెంట్స్

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప2లో ప్రియమణి నటిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన భార్యగా ప్రియమణి కనిపించనున్నారనే టాక్‌ వినిపించింది. దీనిపై ప్రియమణి స్పందించారు. తాను నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’ విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ‘పుష్ప 2’ గురించి హోస్ట్‌ ప్రశ్నించగా ఆ చిత్రంలో తాను నటించట్లేదని ప్రియమణి స్పష్టం చేశారు. ఆ రూమర్స్‌ చూసి వెంటనే తన మేనేజరుకు ఫోన్‌ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అవకాశం వస్తే తప్పకుండా అల్లు అర్జున్‌తో కలిసి నటించేందుకు సిద్ధమన్నారు.