Business

అదానీ గ్రూపులో భారీ పెట్టుబడులు…అందుకేనా? – వాణిజ్య వార్తలు

అదానీ గ్రూపులో భారీ పెట్టుబడులు…అందుకేనా? – వాణిజ్య వార్తలు

* అదానీ గ్రూప్‌ లోని రెండు కంపెనీల్లో బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్‌ గ్రూప్‌ తమ వాటాలను పెంచుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 69.87 శాతం వాటాను 71.93 శాతానికి పెంచుకున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్స్‌లో వెల్లడించారు. ఈ కంపెనీ నెల వ్యవధిలోనే రెండోసారి వాటా పెంచుకోవడం గమనార్హం. మరోవైపు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో వాటాను 65.23 శాతం నుంచి 63.06 శాతానికి పెంచుకున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువ పతనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం నింపాలనే వ్యూహంలో భాగంగానే ప్రమోటర్ గ్రూప్‌ వాటాల కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో ‘రిస్టర్జెంట్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌’ తాజాగా దాదాపు ఒక శాతం వాటాను సొంతం చేసుకుంది. మరో 1.2 శాతం వాటాను ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డీఎంసీసీ కొనుగోలు చేసింది. ఈ రెండూ ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలే. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో కెంపాస్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్ఫైనైట్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ తమ వాటాలను పెంచుకున్నాయి. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 8 మధ్య ఆయా కంపెనీలు వాటాలను కొనుగోలు చేశాయి. అదానీ గ్రూప్‌ సంస్థల్లో అమెరికా పెట్టుబడుల సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ వాటాలను కొనుగోలు చేసిన కొన్ని వారాల్లోనే ప్రమోటర్‌ సంస్థలు కూడా తమ వాటాలను పెంచుకోవడం గమనార్హం.

* అంకురాలు పెట్టుబడుల సమీకరణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వెంచర్‌ క్యాపిటలిస్టులు, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ.. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వృద్ధి దశలోని అంకురాలకు నిధులు అందడం కష్టంగానే ఉన్నా, ప్రారంభ స్థాయిలో ఉన్న అంకురాలకు మాత్రం నిధులు అందుతున్నాయి. ఇది ఆశాజనకమైన పరిణామమని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అంకురాల్లోకి 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి ఇది దాదాపు 64 శాతం తగ్గి 39.6 కోట్ల డాలర్లకే పరిమితం అయ్యింది. అదే సమయంలో ఈ ఏడాది జులైలో వచ్చిన 52.9 కోట్ల డాలర్లతో పోలిస్తే 25 శాతం తగ్గాయి. వరుసగా రెండు నెలల కాలంలో 100 కోట్ల డాలర్లకన్నా తక్కువగా రావడం గమనించాల్సిన పరిణామం. ఆగస్టులో వచ్చిన పెట్టుబడులు 15 నెలల కనిష్ఠమని నివేదికలు పేర్కొంటున్నాయి. జూన్‌, మేలో 110 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.

* మీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల రుణ యోగ్యత(క్రెడిట్‌ వర్తీనెస్‌)పై సమాచారం ఇవ్వాల్సిందిగా కొన్ని అంకుర సంస్థలకు ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం నోటీసులు ఇచ్చింది. మదుపర్లు వాళ్లు ప్రకటించిన ఆదాయాలకు అనుగుణంగానే ఈ పెట్టుబడులు పెట్టారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించేందుకే ఈ సమాచారాన్ని అడుగుతున్నట్లు తెలిపింది.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదారులు ఈ నెలాఖరులోగా తమ ఆధార్ నంబర్‌ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు సమర్పించాలి. ఈ ముఖ్యమైన గడువును కోల్పోవడం వలన వారి చిన్న పొదుపు పెట్టుబడులు స్తంభింపజేయబడతాయి. PPF, SSY, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి PAN, ఆధార్ నంబర్ తప్పనిసరి. దీనికి సంబంధించి 31 మార్చి 2023న నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

* స్మార్ట్​ఫోన్​ మేకర్​ ఒప్పో ఏ38 ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.56-అంగుళాల స్క్రీన్, మీడియాటెక్​ హీలియో జీ85 ప్రాసెసర్, అండ్రాయిడ్​ ​13 ఓఎస్, 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సదుపాయాలు ఉంటాయి. 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 12,999. ఈ నెల13 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

* పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ మేడ్- ఇన్- ఇండియా రిఫ్రిజిరేటర్లను లాంచ్​చేసింది. ఇవి బాటమ్​ మౌంటెడ్ ఫ్రీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తాయి. ఫ్రీజర్ కంపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కింది భాగంలో ఉంటుంది. కూరగాయలను, పండ్లను సులభంగా తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త ప్రైమ్ కన్వర్టబుల్ బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 401, 357 లీటర్ల కెపాసిటీతో వస్తాయి. ధరలు రూ.55,490 నుంచి మొదలవుతాయి. వీటితో పాటు 260 -లీటర్ ఫ్రాస్ట్- ఫ్రీ రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.23,490 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లెక్సీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండబుల్ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైమ్ ఫ్రెష్ జోన్ ఫ్రీజర్, 6 స్పీడ్​ ఇన్వెర్టర్ ​కంప్రెసర్​ వంటి సదుపాయాలు వీటి సొంతం.

* నిత్యావసర వస్తువుల ధరలతోపాటు పెరిగిపోయిన ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఏడాది కాలంగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కాస్త ఉపశమించడంతో వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇండ్ల రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలకు వెసులుబాటు కల్పించడానికి బ్యాంకులు, గ్రుహ రుణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నాయి. రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇండ్ల రుణాలపై వడ్డీరేటు తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక మీరు బ్యాంకు రుణం తీసుకున్నా, తీసుకోవాలనుకున్నా, వడ్డీరేటు తగ్గించుకునేందుకు గల మార్గాలపై మీ ఖాతా గల బ్యాంకు అధికారులతో సంప్రదించడం బెటర్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.