Politics

పల్లెప్రగతికి బాటలు వేసింది భారాస:ఎర్రబెల్లి

పల్లెప్రగతికి బాటలు వేసింది భారాస:ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పల్లెలు సమగ్ర ప్రగతి సాధించాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ నిలిచిందని పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధి కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవార్డు తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నదని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను, విభాగాలను పునర్విభజన చేసిందని, దీని వల్ల ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తున్నాయని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, సిబ్బందికి భారీగా ప్రమోషన్లు వచ్చాయని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన చీఫ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్..వరంగల్, హనుమకొండలో జిల్లాల కార్యాలయాలను మంత్రి దయాకర్ సోమవారం ప్రారంభించారు.